భ్రమరాంబ క్యారెక్టర్‌ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను : రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

  • May 23, 2017 / 06:11 AM IST

యువ సామ్రాట్‌ నాగచైతన్య హీరోగా కీ.శే.శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించి చిత్రం ‘రారండోయ్‌ ..వేడుక చూద్దాం’. ఈ సినిమా మే 26న విడుదలవుతుంది. ఈ సందర్భంగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌తో ఇంటర్వ్యూ…

క్యారెక్టర్‌ గురించి…
– రారండోయ్‌ వేడుక చూద్దాం సినిమాలో నా క్యారెక్టర్‌ పేరు భ్రమరాంబ. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో ఇలాంటి పాత్రను చేయలేదు. చాలా స్ట్రాంగ్‌ క్యారెక్టరైజేషన్‌. చాలా లవబుల్‌ క్యారెక్టర్‌. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో హీరోయిన్‌ పాత్రలాగా నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇలాంటి పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి పాత్రకు నేను న్యాయం చేస్తానని నమ్మి అవకాశం ఇచ్చినందుకు ముందుగా దర్శకుడు కళ్యాణ్‌కృష్ణగారికి థాంక్స్‌. నేను భ్రమరాంబ అయ్యానో, లేక భ్రమరాంబ పాత్రే నాలో అవహించిందో తెలియలేదు కానీ ఈ రోల్‌ చేసేటప్పుడు చాలా ఎంజాయ్‌ చేశాను.

నేనైతే అలాగే చెబుతాను..
– ఎవరైనా నా దగ్గరకు వచ్చి అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అయితే అబ్బాయిలు పాయిజనెస్‌ అని నేను చెబుతాను.

కాస్ట్యూమ్స్‌ విషయంలో…
– విలేజ్‌లో ఉన్న పెద్ద ఫ్యామిలీకి చెందిన అమ్మాయే భ్రమరాంబ. అందుకే పల్లెటూర్లో అమ్మాయిలు బేసే బ్రయిట్‌ కలర్స్‌లా ఇందులో నాకు కూడా బ్రయిట్‌ కలర్స్‌ను డిజైన్‌ చేశారు. భ్రమరాంబగా నా క్యారెక్టర్‌ ఎంత క్యాచీగా జనాలకు రిజిష్టర్‌ అయ్యిందో, నా డ్రెస్సింగ్‌ కూడా అంతే ట్రెండింగ్‌ అవుతుంది. నీరజకోన ఈ సినిమా కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా వర్క్‌ చేశారు.

నేను హైదరాబాదీ అమ్మాయినే..
– నేను ఉత్తరాది అమ్మాయినని మరచిపోయాను. నా సినిమా కెరీర్‌లో టాలీవుడ్‌లోనే ప్రారంభమైంది. నేను హైదరాబాదీ అమ్మాయినని గర్వంగా చెప్పుకుంటాను. నేను తెలుగు కూడా నేర్చుకుంటాను. చెన్నైలో తమిళ సినిమా చేసేటప్పుడు నాకు తెలుగు ట్రాన్స్‌లేటర్‌ను ఇచ్చారు. తమిళంలో డైలాగ్స్‌ను తెలుగులో చెబుతుంటే నేను తమిళ్‌లో డైలాగ్స్‌ చెప్పాను. తెలుగు నాకు ఒక ఐడెంటిటీని ఇచ్చింది.

కారణం డైరెక్టరే..
– నాకు, చైతుకు మధ్య కెమిస్ట్రీ బాగా పండిందంటే కారణం డైరెక్టరే. ఆయన మా క్యారెక్టర్స్‌ను అందంగా డిజైన్‌ చేయకుంటే మేం ఆ రేంజ్‌ కెమిస్ట్రీ పండించలేం కదా. ఈ మూవీలో ఇన్నోసెంట్‌ లవ్‌స్టోరీ కనపడుతుంది. కళ్యాణ్‌కృష్ణ చాలా మంచి వ్యక్తి.

చైతుతో వర్కింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌..
– చైతుతో నాకు ముందు నుండే మంచి పరిచయం ఉండటం వల్ల నాకు ఈ సినిమాలో తనతో వర్క్‌ చేసేటప్పుడు మంచి కంఫర్ట్‌ లెవల్స్‌ ఉన్నాయి. తను చాలా మంచి అబ్బాయి.

నిర్మాత గురించి…
– నాగార్జునగారు చాలా కేర్‌ తీసుకున్నారు. చాలా కంఫర్ట్‌గా ఉంచారు. సుప్రియగారు కూడా తోడుగా ఉండేవారు. సినిమా చివరి రోజు నాగ్‌సార్‌ నాకు ఫోన్‌ చేశారు. నేను మూవీ చూశాను. భ్రమరాంబ క్యారెక్టర్‌ బావుందని చాలా మెచ్చుకున్నారు.

నచ్చిన సాంగ్స్‌..
– దేవిశ్రీప్రసాద్‌గారు అద్భుతమైన మ్యూజిక్‌ అందించారు. తకిట తకజుమ్‌.., టైటిల్‌ సాంగ్‌ నాకు బాగా ఇష్టమైన సాంగ్స్‌.

ప్రొడక్షన్‌ చేస్తారా..
– నేను మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన అమ్మాయిని. ప్రొడక్షన్‌ చేయడానికి ఆసక్తి ఉంది కానీ దానికి ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం నటనపైనే ఆసక్తి ఉంది. నిర్మాతగా మారితే హీరోయిన్‌గా అవకాశాలు తగ్గే అవకాశం ఉంది. ప్రొడక్షన్‌ గురించి ఇప్పుడు ఆలోచించనే లేదు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus