హీరోయిన్ కావాలంటే ఆకట్టుకొనే అందం, కాస్తంత అభినయ సామర్ధ్యం ఉంటే చాలు. కానీ స్టార్ హీరోయిన్ కావాలంటే మాత్రం సదరు కథానాయిక కెరీర్ లో కానీసం ఒక్క బ్లాక్ బస్టర్ అయినా ఉండాలి.
కానీ.. అందాల భామ రకుల్ మాత్రం ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లేకపోయినా కూడా యువ స్టార్ హీరోలందరితో నటించే అవకాశాలు సొంతం చేసుకొంటోంది. రకుల్ ను చూసి ఆమె తోటి కథానాయికలైన రాశిఖన్నా, లావణ్య త్రిపాటి, రేజీనాలు తమలో ఏమి తక్కువ అంటూ కుళ్ళుకొంటున్నారు. మరి రకుల్ సక్సెస్ సీక్రెట్ ఏంటో, వరుస ఆఫర్లు ఎలా దక్కించుకొంటుందో రకుల్ నే అడిగి తెలుసుకోవాలి!