మరింత ఫిట్ అయిన ఫిట్ బ్యూటీ

  • June 15, 2018 / 03:05 AM IST

రకుల్ ప్రీత్ సింగ్ కాస్త సమయం దొరికితే చాలు వ్యాయామంలో మునిగిపోతుంది. అందుకే అందరూ ఫిట్ బ్యూటీ అని పేరు పెట్టారు. ఈమె తెలుగులో నటించిన నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ వంటి సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. రారండోయ్ వేడుక చూద్దాం లో భ్రమరాంబగా ఆకట్టుకుంది. ఇక్కడ టాప్ హీరోయిన్ జాబితాలో స్థానం సంపాదించుకుంది. అలాగే కోలీవుడ్ లోను హిట్స్ అందుకోవాలని స్పైడర్ ద్వారా అడుగుపెట్టింది. అది నిరాశపరిచినప్పటికీ కార్తి, శివకార్తికేయన్‌ సినిమాలలో జోడిగా నటిస్తోంది. సూర్య పక్కన కూడా ఛాన్స్ అందుకుంది. కోలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోను మంచి సినిమాలు చేయాలనీ కలలు కంటోంది.

అందుకే కొన్ని గంటలు ఎక్కువగా వ్యాయామం చేసి మరింత ఫిట్ అయింది. ఇటీవలే హెల్త్ మ్యాగజైన్ కవర్ పేజీకి ఫోజులు ఇచ్చింది. జీరోసైజ్ తో పూర్తి ఫిట్ గా ఉంది. ఇప్పుడు ఫిట్ గా ఉండడం అంటే సెక్సీ గా ఉండడమే అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ లుక్ లో చూసిన ఆమె అభిమానులు కొంతమంది బాగుందని ప్రశంసిస్తుంటే.. బక్కగా మారడంతో రకుల్ గ్లామర్ తగ్గిపోయిందని విమర్శిస్తున్నారు. ఈ దెబ్బతో బాలీవుడ్ లో అవకాశాలు ఎక్కువగా అందుకోవడం గ్యారంటీ అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus