సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు, సినిమా లాభాల్లో ఎంత వాటా ఇస్తున్నారు అని లెక్కలు గట్టి ఎవరూ చెప్పరు. అయితే అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, కొన్ని లెక్కలు బయటకు వస్తుంటాయి. అలా తాజాగా రామ్ చరణ్ పారితోషికానికి సంబంధించి ఓ వివరం బయటకు వచ్చింది. అదే చరణ్ రెమ్యూనరేషన్ బాగా పెంచేశాడని, తన తర్వాతి సినిమాలకు ఒక్కోదానికి ₹వంద కోట్ల వరకు వసూలు చేస్తున్నాడనేది ఆ వార్తల సారాంశం. తాజాగా దీనిపై చరణ్ స్పందించాడు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ప్రచారం కోసం చరణ్ ప్రస్తుతం నగరాలు పట్టుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో చరణ్‌కు ఈ ప్రశ్న ఎదురైంది. అయితే దానికి చరణ్ చాలా వెటకారంగా సమాధానం చెప్పాడు. దీంతో చరణ్ రెమ్యూనరేషన్ విషయంలో వచ్చిన పుకార్లు నిజం కాదని తేలిపోయింది. అయితే ఎంత తీసుకుంటున్నాడు అనేది తెలియలేదు. ఇంతకీ ఏమన్నాడనేగా మీ ప్రశ్న. ‘‘ఏంటీ వంద కోట్లా… ఆ 100 కోట్లు ఎక్కడివి, నాకు ఎవరు ఇస్తున్నారు’’ అంటూ చరణ్ చమత్కరించాడు. అలా రెమ్యూనరేషన్ రూమర్లను కొట్టిపారేశాడు.
చరణ్ కొట్టిపారేశాడు కాబట్టి… ఓకే కానీ అసలు ఎంత తీసుకుంటున్నట్లు అనేదే ప్రశ్న. ఎందుకంటే చరణ్ చేస్తున్న నెక్స్ట్ రెండు సినిమాలు చిన్న బ్యానర్లు కావు, చిన్న సినిమాలు అంతకంటే కావు. ఎందుకంటే ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత చరణ్ చేస్తున్న సినిమా దిల్ రాజు బ్యానర్‌లో.. శంకర్ డైరక్షన్‌లో ఉంది. శంకర్ సినిమా అంటే భారీతనమూ ఉంటుంది, హీరోకు కష్టమూ ఉంటుంది. మరి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుకుంటాడు కూడా. దానికితోడు ఈ సినిమాను పాన్ ఇండియా రేంజిలో విడుదల చేస్తారు.
ఈ సినిమా తర్వాత చరణ్ చేసే సినిమాల విషయంలో చిన్నపాటి క్లారిటీ ఉంది. అదే యూవీ క్రియేషన్స్ – గౌతమ్ తిన్ననూరి సినిమా. క్రీడా నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే గౌతమ్ ఓ కార్యక్రమంలో చెప్పేశాడు. యూవీ క్రియేషన్స్ అంటే బడ్జెట్ లెక్క విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గరు. అందులోనూ చరణ్‌తో భారీ సినిమా చేయాలని వాళ్లు ఎప్పటినుండో చూస్తున్నారు. కాబట్టి భారీగానే చరణ్‌కు ముట్టజెప్పుతారు. సో ఎంత తీసుకుంటాడు అనేది ఇంకా తేలలేదు.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!