‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని మొదట 2020 లో జూలై 30న విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేసాడు రాజమౌళి. కానీ మొదట ప్లాన్ చేసిన విధంగా షెడ్యూల్స్ పూర్తి కాలేదు. మొదట ఎన్టీఆర్ సరసన ఆనౌన్స్ చేసిన హీరోయిన్ కూడా హ్యాండ్ ఇవ్వడం… ఆ తరువాత ఎన్టీఆర్, చరణ్ లకు గాయాలు అవ్వడం వల్ల షూటింగ్ డిస్టర్బ్ అయ్యింది. ఇదిలా ఉండగా.. మొన్నటికి మొన్న ఈ చిత్రం రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు.
2021 జనవరి 8 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు మళ్ళీ ప్రకటించారు. అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు నిలిచిపోయాయి. దీంతో మళ్ళీ ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదల వాయిదా పడుతుంది.. ఇక 2021 సమ్మర్ కే విడుదల అవుతుంది అనే కామెంట్స్ మొదలయ్యాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని నిర్మాత స్పందించినా… రాజమౌళి చెక్కుబడి గురించి తెలిసిన వాళ్లు అది సాధ్యం కాదని ధీమాగా చెబుతున్నారు. అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు యదావిధిగా జరుగుతున్నాయి.
రాంచరణ్, ఎన్టీఆర్ ల ఇళ్ళల్లో మినీ థియేటర్స్ ఉన్నాయట. రాజమౌళి క్వాలిటీతో కూడిన మైక్ లు పంపించాడట. ఇద్దరూ తమ ఇళ్లలోనే ఉంటూ.. రాజమౌళి వీడియో కాల్స్ లో ఇస్తున్న టిప్స్ తో డబ్బింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు అని సమాచారం. ఇంత చేసినా వాటితో రాజమౌళి సంతృప్తి చెందుతాడా… సినిమా ఆనౌన్స్ చేసిన టైం కి విడుదలవుతుందా అనేది పెద్ద ప్రశ్న. లేక పోతే ఈ టైములో కూడా చరణ్, ఎన్టీఆర్ ల కష్టం వేస్ట్ అయిపోయినట్టే…!
Most Recommended Video
అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!