Ram Charan, Upasana: పుట్టిన వెంటనే దాచేస్తారంట! అలా చేస్తే మంచిదే!
June 14, 2023 / 07:40 PM IST
|Follow Us
రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కొణిదెల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఎవరూ ఊహించని పని చేస్తుంది. మరికొన్ని రోజుల్లో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఆమెకు నెలలు దగ్గరపడ్డాయి. రామ్ చరణ్ కి పుట్టబోయే బిడ్డ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వారికి పదేళ్ల కల. ఉపాసన 2012లో రామ్ చరణ్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో ఘనంగా నిర్వహించారు.
అయితే పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా ఉపాసన తల్లి కాలేదు. ఈ క్రమంలో అనేక పుకార్లు తెరపైకి వచ్చాయి. 2022 డిసెంబర్ నెలలో మెగాస్టార్ చిరంజీవి గుడ్ న్యూస్ చెప్పారు. కోడలు ఉపాసన తల్లి అయ్యారనే వార్త సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. చిరంజీవి ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. మెగా వారసుడు వస్తున్నాడని వారు సంబరాలు చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఉపాసన సీమంత వేడుకలు నిర్వహించారు.
ఉపాసన డెలివరీకి సమయం దగ్గరపడుతుండగా ఆమె ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. పుట్టబోయే బిడ్డ కార్డు బ్లడ్ భద్రపరచనున్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. భవిష్యత్ లో బిడ్డకు ఏమైనా సమస్యలు వస్తే ట్రీట్మెంట్ ఇవ్వడానికి మాయ, బొడ్డు నుండి రక్తం సేకరించి ప్రత్యేక పద్ధతిలో భద్రపరుస్తారు. అవసరమైనప్పుడు కార్డ్ బ్లడ్ వాడి వ్యక్తులను రోగాల నుండి కాపాడవచ్చు.
ఈ విధానం స్టెమ్ సైట్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. ఆ సంస్థ ద్వారా ఉపాసన బిడ్డ కార్డు బ్లడ్ సేకరించి భద్రపరచనున్నారు. ఈ మేరకు ఉపాసన ప్రకటన చేశారు. ఇక పెళ్ళైన వెంటనే పిల్లలను కనకూడదని ఉపాసన నిర్ణయం తీసుకుందట. ఈ విషయంలో కుటుంబ సభ్యులు, సమాజం నుండి ఒత్తిడి ఎదురైనా వెరవకుండా మా నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ఉపాసన చెప్పుకొచ్చారు.
ఉపాసన (Upasana) అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్ పర్సన్ గా ఉన్నారు. అలాగే ఆమె అనేక ఇతర వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక మూవీ ప్రకటించారు.