Ram Charan: మేకోవర్ కోసం చరణ్ ప్లానింగ్… సినిమాకు యాక్షన్ చెప్పేది అప్పుడేనా?
July 22, 2024 / 01:13 PM IST
|Follow Us
రామ్ చరణ్ (Ram Charan) కొత్త సినిమా ప్రారంభమై ఎన్ని రోజలైందో? అనౌన్స్ చేసిన చాలా రోజుల తర్వాత లాంఛనంగా ముహూర్తపు షాట్‌తో స్టార్ట్ చేసిన ఈ సినిమా ఇంకా షూటింగ్ ప్రారంభించుకోలేదు. ఇదిగో, అదిగో అంటున్నారు కానీ ఎక్కడా ఎప్పుడు అనేది చెప్పడం లేదు. అయితే తాజాగా ఈ సినిమా తొలి షాట్‌కి యాక్షన్ చెప్పడానికి ముహూర్తం సిద్ధం చేశారు అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సెప్టెంబరులో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందట.
రామ్ చరణ్- బుచ్చిబాబు సానా (Buchi Babu) కాంబినేషన్లో రూపొందనున్న ఈ సినిమాకు ‘పెద్ది’ (RC16/Peddi) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడా సినిమా పేరు చెప్పకపోయినా అదే పేరు ఫైనల్ అని సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. ఈ సినిమా కోసం దర్శకుడు పెద్ద టీమ్‌నే ప్లాన్ చేశారు. జాన్వీ కపూర్‌ను (Janhvi Kapoor) హీరోయిన్గా తీసుకోగా, ఏఆర్ రెహమాన్‌ను (A.R.Rahman) సంగీత దర్శకుడిగా తీసుకొన్నారు. ఇంకా చాలాపెద్ద కాస్టింగ్ అండ్ క్రూ సిద్ధం చేస్తున్నారు.
నిజానికి ఈ సినిమా మొదలై చాలా రోజులు అవ్వాల్సింది. అయితే శంకర్ (Shankar) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)పనులు నత్తనడకన సాగడంతో ఈ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు చరణ్ ఆ సినిమా నుండి రిలీవ్ అయ్యాడు. డబ్బింగ్ పనులు లాంటివి కొన్ని ఉన్నాయనుకోండి. ఈ నేపథ్యంలో తర్వాతి సినిమా కోసం మేకోవర్ చేసే పనుల్లో బిజీగా ఉన్నాడట. ‘పెద్ది’ సినిమాలో పాత్ర కోసం రామ్ చరణ్ గడ్డం, మీసాలు, జుట్టు పెంచాల్సి ఉందట.
ఈ మొత్తం మేకోవర్ అవ్వడానికి కనీసం రెండు నెలలు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన సెప్టెంబరు ద్వితీయార్ధంలో సినిమా షూటింగ్ ప్రారంభమవ్వొచ్చు అని అంచనా. అయితే ఈ లోపు ఇంకేమీ అడ్డంకులు, మార్పులు లేకపోతే సెప్టెంబరులో సినిమా షూటింగ్ అప్డేట్స్, లీక్స్ టపీటపీమని వచ్చేస్తాయి. సో వెయిట్ ఫర్ అనదర్ టూ మంథ్స్. చూద్దాం ‘ఉప్పెన’ (Uppena) దర్శకుడి రెండో సినిమా ఎప్పుడు మొదలవుతుందో అని.