Ram Charan: చరణ్ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా?

  • July 14, 2021 / 07:19 PM IST

కరోనా వల్ల దేశంలో లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉపాధిని కోల్పోయిన సంగతి తెలిసిందే. కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించకపోయినా ఉద్యోగుల వేతనంలో భారీగా కోత విధించాయి. కరోనా వల్ల వ్యాపారులు సైతం భారీగా నష్టపోయారు. అయితే సినీ సెలబ్రిటీల దగ్గర పని చేసే సిబ్బందిపై మాత్రం కరోనా ప్రభావం పెద్దగా పడలేదని చెప్పాలి. గతంలో కొంతమంది సెలబ్రిటీల కారు డ్రైవర్ల వేతనాలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ డ్రైవర్ నెల జీతం నెట్టింట హాట్ టాపిక్ అయింది.

చరణ్ తన దగ్గర పని చేసే డ్రైవర్ కు ఏకంగా నెలకు 45వేల రూపాయలు వేతనంగా ఇస్తున్నారని భోగట్టా. జీతంతో పాటు పండుగల సమయంలో సిబ్బందికి బోనస్ లు ఇవ్వడంతో పాటు ఇతర సౌకర్యాలను కూడా చరణ్ కల్పిస్తారని తెలుస్తోంది. సాఫ్ట్ వేర్ బేసిక్ శాలరీ స్థాయిలో చరణ్ తన దగ్గర పని చేసేవాళ్లకు వేతనం ఇస్తుండటం గమనార్హం. సాధారణంగా చరణ్ స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

అయినప్పటికీ చరణ్ డ్రైవర్ కు భారీ మొత్తంలో వేతనం చెల్లిస్తున్నారు. రామ్ చరణ్ ఇంట్లో పని చేసే మిగతా సిబ్బందికి కూడా వేతనాలు భారీగానే ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్ లో పాల్గొంటుండగా ఈ సినిమాతో పాటు చరణ్ శంకర్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. మరోవైపు చరణ్ నటిస్తున్న ఆచార్య సినిమా పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus