సినిమా సక్సెస్ అనేది ఇండస్ట్రీకి మంచిది, హీరోకి కాదు
May 12, 2018 / 11:54 AM IST
|Follow Us
ఇది మానవ నైజమో లేక దేవాదులు అలవాటు చేసిన నీచ సంస్కృతో తెలియదు కానీ.. మనం సాధించిన విజయం కంటే ఎదుటి వ్యక్తి పరాజయం నుంచి ఎక్కువ ఆనందపడుతుంటామ్. ఒకవేళ అవతలి వ్యక్తి సాధించిన విజయం మనకంటే పెద్దదైనప్పుడు ఆ విజయాన్ని “ఒస్ ఇంతేనా?” అని తీసిపారేసినట్లుగా కామెంట్ చేయడం కూడా తరచుగా జనాలు చేసే హేయమైన పని. అయితే.. ఆ తరహా దరిద్రపుగొట్టు కంపేరిజన్స్ నాకు నచ్చవు అంటున్నాడు రామ్ చరణ్.
రీసెంట్ గా రామ్ చరణ్ నటించిన “రంగస్థలం” ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత వచ్చిన మహేష్ బాబు “భరత్ అనే నేను” కూడా మంచి హిట్ అయినప్పటికీ.. రంగస్థలం రేంజ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఈ విషయాన్ని కొన్ని మీడియా హౌస్ లు పదే పదే స్పెషల్ ప్రోగ్రామ్స్ ద్వారా కంపేర్ చేయడం అనేది అస్సలు నచ్చలేదని చెప్పుకొచ్చాడు చరణ్. నేను, మహేష్ బెస్ట్ ఫ్రెండ్స్, ఒక సినిమా సక్సెస్ అనేది హీరో ఇమేజ్ కి కాదు ఇండస్ట్రీ ఎదుగుదలకు తోడ్పడే విషయం. ఈ విషయాన్ని కొందరు పట్టించుకోకుండా వక్రీకరిస్తున్నారు. ఇకకైనా అలాంటి చీప్ ట్రిక్స్ మానుకోవాలి అంటూ హితబోధ చేశాడు.