Ram Charan, Samantha: వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చరణ్.. కానీ?
February 15, 2022 / 03:30 PM IST
|Follow Us
ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకోవడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మార్చి నెల 25వ తేదీన థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా కోసం చరణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు చరణ్ నటించిన ఆచార్య ఏప్రిల్ నెలలో రిలీజ్ కానుండటం గమనార్హం. శంకర్ డైరెక్షన్ లో చరణ్ ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. అయితే చరణ్ డిజిటల్ ఎంట్రీ కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ కోసం చరణ్ ఒక వెబ్ సిరీస్ లో నటించనున్నారని సమాచారం. త్వరలో నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ అయితే ఉంది. నెట్ ఫ్లిక్స్ వరుసగా వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ సబ్ స్క్రైబర్లను పెంచుకునే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. ఇండియాలో ఇతర ఓటీటీలతో పోలిస్తే నెట్ ఫ్లిక్స్ కు సబ్ స్క్రైబర్ల సంఖ్య తక్కువగా ఉంది.
2022 సంవత్సరంలోనే ఈ వెబ్ సిరీస్ సెట్స్ పైకి వెళ్లనుందని బోగట్టా. సమంత ఇప్పటికే ఫ్యామిలీమ్యాన్2 వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు. సమంత బాటలో చరణ్ నడుస్తుండటం గమనార్హం. నెట్ ఫ్లిక్స్ బృందం త్వరలో రామ్ చరణ్ ను కలవబోతుందని సమాచారం. ఈ వెబ్ సిరీస్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారనే వార్త అభిమానులకు కూడా సంతోషాన్ని కలిగిస్తోంది.
చరణ్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చరణ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ రెమ్యునరేషన్ ను పెంచే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.