Ram Charan: రామ్ చరణ్ పారితోషికం వింటే మాత్రం మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!
May 29, 2024 / 06:09 PM IST
|Follow Us
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ (RRR) , గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలకు పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకోగా బుచ్చిబాబు (Buchi Babu Sana) సినిమాకు మాత్రం మార్కెట్ కు అనుగుణంగా పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. బుచ్చిబాబు సినిమాకు చరణ్ పారితోషికం 125 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమాతో పోల్చి చూస్తే 30 శాతం ఎక్కువ మొత్తం రామ్ చరణ్ పారితోషికంగా అందుకున్నారని సమాచారం అందుతోంది.
చరణ్ రెమ్యునరేషన్ పెరిగినట్టు అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. రామ్ చరణ్ ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుండగా గేమ్ ఛేంజర్ రిలీజ్ తర్వాత ఇతర భాషల్లో రామ్ చరణ్ కెరీర్ గురించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. రామ్ చరణ్ తన సినిమాల్లో వరుసగా బాలీవుడ్ బ్యూటీలకు ఛాన్స్ ఇస్తుండటం గమనార్హం. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ రావాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.
చరణ్ ప్రాజెక్ట్స్ ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 18 సంవత్సరాల సినీ కెరీర్ లో చరణ్ కేవలం 14 సినిమాల్లో మాత్రమే నటించారు. చిరంజీవి (Chiranjeevi),, చరణ్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని నెటిజన్లు కోరుకుంటుండగా కథ డిమాండ్ చేస్తే మాత్రమే ఈ కాంబినేషన్ ను రిపీట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ కాంబినేషన్ లో మరో సినిమా రావాలంటే మాత్రం మరికొన్ని సంవత్సరాలు ఆగాల్సిందేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరు , చరణ్ భవిష్యత్తు సినిమాలతో భారీ రికార్డులను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తో బాలీవుడ్ లో రామ్ చరణ్ మార్కెట్ పెరిగిందని భోగట్టా.