Ram Charan: రామ్‌చరణ్‌ హాలీవుడ్‌ సినిమా రూమర్‌ కాదా? ఇదిగో క్లారిటీ!

  • March 10, 2023 / 05:42 PM IST

మెగా పవర్‌ స్టార్‌గా ఇటీవల అమెరికా విమానం ఎక్కిన రామ్‌చరణ్‌… ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌ అయిపోయాడు. ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన చరణ్‌.. అదే సినిమా ఆస్కార్‌ ప్రచారం కోసం వెళ్లి గ్లోబల్‌ స్టార్‌ అయిపోయాడు. అయితే ఇప్పుడు ఆ పేరును కొనసాగించాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. ఈ క్రమంలో ఓ హాలీవుడ్‌ సినిమాలో నటించబోతున్నాడట. ఈ మేరకు గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో పుకార్లు కనిపిస్తున్నాయి. దీనికి ఇటీవల చరణ్‌ అమెరికాలో చేసిన కామెంట్సే కారణం.

నటుడిగా అన్ని దేశాల సినిమాల్లోనూ నటించాలని ఉంది. ప్రస్తుతానికి ఇతర దేశాల సినిమాలకు సంబంధించి టీమ్స్‌తో చర్చలు జరుగుతున్నాయి. కొన్ని నెలల్లో నా హాలీవుడ్‌ ఎంట్రీకి సంబంధించిన వార్త వస్తుంది అని చరణ్‌ చెప్పాడు. అంతే కాదు ‘టర్మినేటర్‌’, ‘గ్లాడియేటర్‌’, ‘బ్రేవ్‌హార్ట్‌’ తదితర హాలీవుడ్‌ చిత్రాలు వ్యక్తిగతంగా చాలా ఇష్టమని చెప్పాడు. దీంతో ఏదో ఒక సూపర్‌ హీరో సినిమాలో చరణ్‌ ఓ పాత్ర పోషిస్తాడు అంటూ పుకార్లకు ఊతమొచ్చింది. అయితే కచ్చితంగా ఈ పాత్ర, ఈ సినిమా అని మాత్రం చరణ్‌ చెప్పలేదు.

అంతేకాదు తనకు జులియా రాబర్ట్స్‌ అంటే చాలా ఇష్టమని ఇప్పటికే చెప్పిన చరణ్‌.. ఆమెను చూస్తే కను రెప్ప వేయాలని అనిపించదు అని కూడా చెప్పాడు. ఈ క్రమంలో అతిథి పాత్రలోనైనా ఆమెతో కలిసి ఓ సినిమాలో నటించానుంది అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు. దీంతో ఆమె నెక్స్ట్‌ సినిమాలేంటి, హాలీవుడ్‌లో రూపొందబోతున్న నెక్స్ట్‌ సూపర్‌ హీరో సినిమాలేంటి అనే లెక్కలేస్తున్నారు మెగా ఫ్యాన్స్‌.

‘ఆర్ఆర్ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు…’ పాట ఆస్కార్‌ నామినేషన్లలో ఉండటంతో ఆ సినిమా ప్రచారం కోసం చరణ్‌ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర అంశాలు చెబుతున్నాడు. అందులో భాగంగానే ఈ హాలీవుడ్‌ సినిమా ముచ్చట బయటకొచ్చింది. మరి ఇదంతా నిజమై, ఓ సినిమా ఓకే అయితే మెగా పవర్‌ స్టార్… గ్లోబల్‌ స్టార్ అయిపోవచ్చు. లేదంటే గ్లోబల్‌ మెగా పవర్‌ స్టార్‌ కూడా అవ్వొచ్చు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus