Ram Charan: మీ అభిమానమే ఆస్కార్ కు దారి వేసింది: చరణ్

  • March 18, 2023 / 07:43 PM IST

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం RRR. ఈ సినిమాలోని నాటునాటు పాట ఏకంగా ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం ఎంతో విశేషం. ఇలా ఆస్కార్ వేడుక పూర్తయిన తర్వాత చిత్ర బృందం మొత్తం శుక్రవారం ఉదయం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.ఇలా హైదరాబాద్ చేరుకున్నటువంటి చిత్ర బృందం ఆస్కార్ అవార్డు గురించి ఏదైనా మాట్లాడాలని మీడియా కోరడంతో రాజమౌళి జై హింద్ అంటూ ఒకే ఒక్క మాటతో మరోసారి అందరి మనసులు దోచుకున్నారు.

ఇలా చిత్ర బృందం మొత్తం హైదరాబాద్ చేరుకోగా రామ్ చరణ్ ఉపాసన మాత్రం ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో జరిగినటువంటి ఇండియా టుడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆస్కార్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం ఎంతో గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఇక ఈ పాటకు ఆస్కార్ అవార్డు రావడానికి ప్రేక్షకుల అభిమానమే కారణమని తెలిపారు.

భారతీయ అభిమానులందరూ కూడా ఈ చిత్రాన్ని ఎంతగానో ఆదరించారు. ఈ సినిమాలోని నాటు నాటు పాటను సూపర్ హిట్ చేశారు. ఈ పాట మాది కాదు మీది. మీరు చూపించిన అభిమానమే ఆస్కార్ అవార్డుకు బాటలు వేసిందని.. ఈ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చేలా చేసిందని రామ్ చరణ్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక ఈ పాట ఇంత మంచి హిట్ అవ్వడానికి కారణమైనటువంటి చంద్రబోస్ కీరవాణి రాజమౌళి గారికి కృతజ్ఞతలు అంటూ చరణ్ తెలిపారు.

ఇలా ఆస్కార్ గెలుచుకొని తిరిగి ఇండియా వచ్చిన తర్వాత మొదటిసారి రామ్ చరణ్ ఇండియా టుడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో పాల్గొని ఆస్కార్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక అమెరికా పర్యటన పూర్తి కావడంతో ఈయన తిరిగి తన తదుపరి చిత్రం శంకర్ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus