మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అభిమానులకు షాక్ ఇవ్వనున్నారా ? అంటే అవుననే సమాధానం చెబుతున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఎందుకో వివరాల్లోకి వెళితే.. ధృవ సినిమా తర్వాత రామ్ చరణ్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో “రంగస్థలం 1985 ” మూవీ చేస్తున్నారు. ఈ సినిమా రాజమండ్రిలోని అందమైన ప్రాంతంలో రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో గతనెల 24 న మొదలయింది. కళా దర్శకుడు రామకృష్ణ 5 కోట్లతో వేసిన పల్లెటూరు సెట్ లో భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. అయితే ఈ షెడ్యూల్ అనుకున్నట్లు జరగలేదు. సుకుమార్ తాను నిర్మాతగా వ్యవహరించిన దర్శకుడు సినిమా ప్రమోషన్లో భాగంగా షెడ్యూల్ కి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు. అలాగే రామ్ చరణ్ కూడా తాను నిర్మించనున్న సైరా నరసింహారెడ్డి సినిమా ప్రారంభోత్సవం పనుల్లో పడి కొన్ని రోజులు తన సినిమా షూటింగ్ ని పక్కన పెట్టారు.
దీంతో ఈ సినిమా అక్టోబర్ నాటికీ కంప్లీట్ అయ్యేట్టు కనిపించడంలేదు. పైగా సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ నెల మొత్తం సమంత పెళ్లి కోసం కేటాయించనున్నారు. సో షెడ్యూల్ పోస్ట్ పోన్ అవుతుందని సమాచారం. ఈ కారణాల వల్ల “రంగస్థలం” సంక్రాంతికి విడుదల అయ్యేలా లేదని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తరవాత మంచి సీజన్ అంటే వేసవి కాబట్టి.. అప్పుడే రిలీజ్ చేయాలనీ ఆలోచనలో ఉన్నట్లు టాక్.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.