సెట్స్ మీద సినిమా ఉండగానే తర్వాతి సినిమా మీద క్లారిటీ ఇచ్చేస్తున్న రోజులివి. యంగ్ హీరోలు అయితే మరీనూ. అయితే యంగ్ స్టార్‌ల విషయంలో ఇది అంతగా లేదనే చెప్పొచ్చు. కానీ కరోనా పరిస్థితులు నేపథ్యంలో కథలు వినడం, ఓకే చేసేయడం ఎక్కువైపోయింది. అలా రామ్‌చరణ్ కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘ఆచార్య’ సెట్స్ మీద ఉండగానే శంకర్ – దిల్ రాజు సినిమా ఓకే చేసేశాడు. అయితే ఆ తర్వాత సినిమా విషయంలో క్లారిటీ వచ్చేసిందని సమాచారం.
శంకర్ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది లాంటి విషయాలు పక్కనపెడితే… ఆ సినిమా అయిన వెంటనే రామ్‌చరణ్ ప్రభాస్‌తో సినిమా చేయనున్నాడని సమాచారం. అయితే మల్టీస్టారర్ కాదు. ఎందుకంటే ఆ సినిమాకు ప్రభాస్ నిర్మాత మాత్రమే. అదేనండీ యూవీ క్రియేషన్స్. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు వంశీ, ప్రమోద్… చరణ్ ఎప్పటి నుండో స్నేహితులు. వారి బ్యానర్‌లో సినిమా చేయాలని చరణ్ చాలా రోజుల నుండి అనుకుంటున్నారు. అయితే ఇప్పటికి ఈ సినిమా ఓ కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది.
2023లో సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. శంకర్ సినిమా అవ్వగానే వచ్చే ఏడాది చరణ్ యూవీ క్రియేషన్స్‌లో నటిస్తాడట. అయితే దర్శకుడి విషయంలోనే క్లారిటీ లేదు. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌లో ముగ్గురు దర్శకులు సిద్ధంగా ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి, వెంకీ కుడుమల, అనిల్ రావిపూడిలో ఒకరు చరణ్‌తో సినిమా చేయొచ్చట. మరి ఇందులో చరణ్ ఏది ఫైనల్ చేస్తాడో చూడాలి.
Most Recommended Video
ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!