Ram Charan, Chiranjeevi: ‘మగధీర’ తొలి రోజుల్లో జరిగిన విషయం చెప్పిన చరణ్!
January 4, 2022 / 09:28 PM IST
|Follow Us
‘మగధీర’ సినిమా కథ రామ్‌చరణ్ చేశాడు కానీ… అన్నీ అనుకున్నట్లు జరిగితే నందమూరి బాలకృష్ణ చేయాల్సింది అనే విషయం మీకు తెలిసిందే. ఆ మధ్య మనం ఈ విషయం గురించి రాశాం కూడా. అయితే ఇప్పుడు మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అయితే ఈసారి కథ గురించి కాదు, కథ విన్నప్పుడు జరిగిన పరిణామం గురించి. ఈ సినిమా కథను రాజమౌళి… రామ్‌చరణ్‌కు చెప్పినట్లు ఏం జరిగిందో ఇటీవల వెల్లడించారు.
మెగా కుటుంబంలో హీరోల కథలు చిరంజీవి తప్పకుండా వింటారనే విషయం తెలిసిందే. మరీ ఫస్ట్ నెరేషన్ కాకపోయినా, కథ ఓకే అనుకున్నాక ఏ సెకండ్, థర్డ్ నెరేషన్ వింటూ ఉంటారు. అందులో ఏవైనా మార్పులు అవసరమైతే సూచిస్తూ ఉంటారు. అదే ఆ హీరోలకు తొలినాళ్లలో అయితే తొలి నరేష్ నుండి వినేవారు చిరంజీవి. అలా ‘మగధీర’ సినిమా సమయంలో రామ్‌చరణ్‌తోపాటు చిరంజీవి కూడా కథ విన్నారట. ఆ తర్వాత కథ గురించి, కథనం గురించి, అందులో సన్నివేశాల గురించి కూడా రాజమౌళి చెబుతుంటే ఆసక్తిగా వినేవారట. ఈ క్రమంలో ఓసారి ఆ సినిమాలో తనే హీరో అనుకున్నారట.
ఈ విషయాన్ని రామ్‌చరణే ఇటీవల చెప్పుకొచ్చారు.‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఓ ఈవెంట్లో ఈ విషయం చర్చకొచ్చింది. ‘మగధీర’ కథ వింటున్నప్పుడు మీకేమనిపిచింది అని హోస్ట్ అడగ్గా… ‘‘నా సంగతి పక్కన పెడితే… ఓసారి సన్నివేశం గురించి రాజమౌళి చెబుతుండగా, చిరంజీవి యాక్టివ్ అయిపోయి… ఈ సీన్లో నేను ఇలా చేస్తే బాగుంటుంది కదా?’ అని అడిగారట. దీంతో రాజమౌళి స్పందించి ‘సర్, ఈ సినిమాలో హీరో మీరు కాదు, రామ్‌చరణ్’’ అని చెప్పారట.
అలా తిరిగి మళ్లీ చిరంజీవి ‘అవును కదా’, అనుకొని కథ విన్నారట. చిరంజీవి అలా అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే రాజమౌళి సినిమాల కథలు అలా ఉంటాయి, అందులో సన్నివేశాలు అంత అద్భుతంగా ఉంటాయి. వాటిని ఆయన నెరేట్ చేయడమూ అంతే అద్భుతం అంటుంటారు. అలా చిరంజీవి ‘మగధీర’ తనే హీరో అనుకొని రియాక్ట్ అయ్యారు.