Ram Charan: ఆచార్యలో నిడివిపై క్లారిటీ ఇచ్చిన చరణ్!
April 25, 2022 / 02:38 PM IST
|Follow Us
చిరుత సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన రామ్ చరణ్ సినిమాసినిమాకు నటుడిగా ఎదుగుతూ విజయాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే. చరణ్ నటించిన ఆచార్య సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. చరణ్ మాట్లాడుతూ మిర్చి సినిమా నుంచి నేను, కొరటాల శివ కలిసి సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నామని ఆచార్య మూవీలో నటించడం దైవ ఆశీర్వాదంలా జరిగిపోయిందని చరణ్ తెలిపారు. రంగస్థలం సినిమా తర్వాత తను హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించాల్సి ఉందని
అదే సమయంలో ఆర్ఆర్ఆర్ మూవీలో ఛాన్స్ రాగా మీ సినిమాను పూర్తి చేసి రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తానని కొరటాలతో చెబితే ఆయన వద్దన్నారని చరణ్ వెల్లడించారు. ఆ తర్వాత నాన్న కొరటాల శివ డైరెక్షన్ లో నటించడానికి ముందుకు వచ్చారని అలా ఆచార్య కథ కుదిరిందని చరణ్ కామెంట్లు చేశారు. ఆచార్య సినిమాలో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చానని మొదట తన పాత్ర అతిథి పాత్ర కాగా తన పాత్రను 40 నిమిషాలకు పెంచారని చరణ్ చెప్పుకొచ్చారు.
ఆచార్య విషయంలో రాజమౌళికి కృతజ్ఞతలు తెలపాలని చరణ్ కామెంట్లు చేశారు. ఏ ఇద్దరు హీరోలు కలిసి నటించినా ఆచార్య, సిద్ధ పాత్రలు హిట్టేనని చరణ్ చెప్పుకొచ్చారు. ఆచార్య సినిమాలో తాను గురుకులం విద్యార్థిగా కనిపించానని చరణ్ తెలిపారు. ఒకే కారణం కోసం సినిమాలో ఆచార్య, సిద్ధ పాత్రలు కలుస్తాయని ఆచార్య సినిమా ద్వారా నటుడిగా నాన్న నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చరణ్ చెప్పుకొచ్చారు. కొన్నిరోజుల తర్వాత ఈ సినిమాను హిందీలో విడుదల చేస్తామని చరణ్ కామెంట్లు చేశారు.
కథ నచ్చితే బాలీవుడ్ సినిమాలు చేయడానికి కూడా సిద్ధమేనని ఆయన తెలిపారు. ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తో తనపై బాధ్యత మరింత పెరిగిందని చరణ్ చెప్పుకొచ్చారు. శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 60 రోజుల షూటింగ్ ను పూర్తి చేసుకుందని చరణ్ అన్నారు. చరణ్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.