Ram Charan, Shankar: చరణ్ శంకర్ మూవీకి క్రేజీ టైటిల్!

  • September 8, 2021 / 02:46 PM IST

స్టార్ డైరెక్టర్ శంకర్ స్టార్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు జరగనుండగా ఈ సినిమాకు సంబంధించి నెట్టింట ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. శంకర్ ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు వైరల్ అవుతున్న వార్త సారాంశం. ఈ టైటిల్ డా. సి నారాయణరెడ్డికి జ్ఞానపీఠ్ అవార్డ్ ను తెచ్చిపెట్టిన పద్య కావ్యం యొక్క పేరు కావడం గమనార్హం.

శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజ్ నిర్మాతగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. దిల్ రాజు శంకర్ కు బడ్జెట్ విషయంలో పరిమితులు విధించారని అనుకున్న బడ్జెట్ లోనే మూవీ పూర్తి కావాలని సూచనలు చేశారని సమాచారం. శంకర్ డైరెక్షన్ లో గతంలో తెరకెక్కిన సినిమాలు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కడంతో దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

చరణ్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని ఆ తర్వాత వేర్వేరు రీజన్స్ వల్ల సీఎం అవుతారని తెలుస్తోంది. ఈ సినిమా ఒకే ఒక్కడు మూవీకి సీక్వెల్ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని సమాచారం. చరణ్ ఈ మూవీ కోసం 40 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పారితోషికంగా తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus