Ram Charan: నా కండీషన్స్‌కి ఒప్పుకుంటేనే రీమేక్స్ చేస్తానంటున్న రామ్ చరణ్..!
December 1, 2022 / 10:56 AM IST
|Follow Us
రీమేక్స్.. ఈ మధ్య నటరత్న ఎన్టఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వరకు.. ఏ హీరో ఎన్ని రీమేక్స్ చేశారనే వార్తలు ట్రెండ్ అవడం చూశాం.. ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం అంటే సులువే అనుకుంటారు కానీ.. మరో భాషకు, ప్రాంతానికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేయాలి.. అది కూడా కథలోని ఆత్మ అనేది పోకుండా చూసుకోవాలి.. ఇక హీరోల విషయానికొస్తే..
అంతకుముందు చేసిన నటుడితో పోలిక అనేది తప్పకుండా ఉంటుంది.. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీమేక్ సినిమాల గురించి, హీరోల గురించి తన అభిప్రాయాన్ని చెబుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. చరణ్ తమిళనాట సూపర్ హిట్ అయిన ‘తని ఒరువన్’ చిత్రాన్ని తెలుగులో ‘ధృవ’ పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. అలాంటి చెర్రీ.. రీమేక్స్ చేస్తే హీరోల స్థాయి తగ్గిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి..
ఈమధ్య ఢిల్లీకి చెందిన పాపులర్ హిందూస్తాన్ టైమ్స్ ఛానల్ చరణ్‌ని ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రీమేక్స్ గురించి మాట్లాడుతూ..‘‘ఆల్రెడీ ఓటీటీలో అందుబాటులో ఉన్న సినిమాని ఇంకో భాషలోకి రీమేక్ చేయడం కరెక్ట్ కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం.. ఎందుకంటే.. అప్పటికే ఓటీటీలో ఆ సినిమాల్ని ప్రేక్షకులు చూసేసి ఉంటారు.. అలాంటి వాటిని రీమేక్స్ చేసి థియేటర్లలో రిలీజ్ చేస్తే.. చూడ్డానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించరు..
ఒకవేళ స్టార్ హీరో రీమేక్ చేస్తే.. ఆ క్రేజ్ వల్ల కొంత వరకే హాళ్లకు వస్తారు.. నేనైతే ఓటీటీలో రాని చిత్రాలనే రీమేక్ చేస్తాను. ఒకవేళ నాకు చేయాలనిపిస్తే.. ఆ నిర్మాతకి ఓటీటీలో విడుదల చెయ్యొద్దని ముందే చెప్తాను.. ఆ కండీషన్‌కి మేకర్స్ ఒప్పుకుంటేనే నేనే రీమేక్స్‌కి రెడీ’’ అని చెప్పుకొచ్చాడు.. రీమేక్ సినిమాలను హైప్ చేసే క్రమంలో హీరోల స్థాయి తగ్గిపోతుందనే విధంగా చరణ్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని ఫిలిం వర్గాలు అంటున్నాయి..