Ram Charan, Rahul Sankrityan: ‘ఆత్మ’, ‘గత జీవితం’ ఇప్పుడు చరణ్‌తో ఏంటో?
January 10, 2022 / 06:28 PM IST
|Follow Us
వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తూ వస్తున్న రామ్‌చరణ్… ట్రెండ్ మారుద్దామని చూస్తున్నాడా? అతని నెక్స్ట్ సినిమాల లైనప్ చూస్తే అదే అనిపిస్తోంది. ‘జెర్సీ’ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సినిమాను ఓకే చేసి ఈ విషయంలో చిన్న హింట్ ఇచ్చాడు రామ్ చరణ్. ఇప్పుడు ఆ తర్వాతి సినిమా గురించి ఆలోచిస్తున్న విధానం చూస్తే కచ్చితంగా కమర్షియల్ సినిమాలకు కాస్త దూరంగా వెళ్తున్నాడా అనిపిస్తోంది. అలా అని అవి పూర్తి క్లాస్ సినిమాలు కూడా కావు. అయితే ప్రయోగాత్మక మాస్ సినిమాలు అనొచ్చు.
రామ్‌చరణ్ ఇటీవల ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా చూశాడు. ఆ సినిమాను పొగుడుతూ, చిత్రబృందం పని తీరును విష్ చేస్తూ ట్వీట్లు చేశాడు చరణ్. అయితే ఆ ట్వీట్ల వెనుక మరో కోణం ఉందంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా చూసిన చరణ్‌కు రాహుల్ సాంకృత్యాన్ పనితనం మీద ముచ్చటేసిందట. అందుకే తన నెక్స్ట్ మూవీ అతనితో చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నాడట. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే గౌతమ్ తిన్ననూరి సినిమా తర్వాత రాహుల్ సినిమానే లైనప్‌లో ఉండొచ్చు అంటున్నారు.
ఈ లెక్కన రామ్‌చరణ్ సినిమాల లైనప్ ఇలా మారింది. ప్రస్తుతం శంకర్ – దిల్ రాజు సినమా చేస్తున్నాడు. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి – యూవీ క్రియేషన్స్ సినిమా, ఆ వెంటనే రాహల్ సాంకృత్యాన్ సినిమా ఉండొచ్చు. లేదంటే ప్రశాంత్ నీల్ సినిమా తర్వాతైనా ఉండొచ్చని టాక్. మరి రామ్‌చరణ్ ఆలోచన ఎలా ఉందో తెలియడం లేదు. అయితే సుకుమార్ – రామ్‌చరణ్ కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని మొన్నీ మధ్య రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే.
దీంతో ఏ సినిమా ఎప్పుడు అనేది చరణే చెప్పాలి. ఇక రాహుల్ సాంకృత్యాన్ సినిమాలు మాస్ సినిమాలే కానీ… చిన్నపాటి సైంటిఫిక్షన్ టచ్ ఉంటుంది. దాంతోపాటు సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా అంతర్లీనంగా చూపిస్తూ ఉంటారు. మరిప్పుడు చరణ్‌తో ఎలాంటి సినిమా చేస్తాడు అనేది చూడాలి. ‘ట్యాక్సీవాలా’లో ఆత్మలు, ‘శ్యామ్ సింగరాయ్’లో పునర్జన్మల కాన్సెప్ట్‌ను రాహుల్ చూపించిన విషయం తెలిసిందే.