Ram Charan: హీరోకి బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్!
September 1, 2022 / 05:22 PM IST
|Follow Us
ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోలు పాన్ ఇండియా స్థాయి సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ వంటి హీరోలు ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసి పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు రావడంతో ఈ హీరోలకు పాన్ ఇండియా లెవెల్లో యాడ్స్ చేసే అవకాశాలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఇప్పటికే ఎన్నో యాడ్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ సైతం హీరో మోటో కార్ప్‌కు చెందిన ఓ గ్లామర్ బైక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యాడ్ కు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. అయితే ఈ యాడ్ కేవలం రెండు నిమిషాల నిడివి ఉన్నట్లు సమాచారం. ఇకపోతే ఈ యాడ్ లో చేయడం కోసం రామ్ చరణ్ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది.
పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరోలు చేసిన ఈ యాడ్ దేశవ్యాప్తంగా ప్రసారమవుతుంది. తద్వారా ఇలాంటి యాడ్స్ కోసం హీరోలు భారీగానే ఛార్జ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే రామ్ చరణ్ సైతం ఈ రెండు నిమిషాల యాడ్ చేయడం కోసం ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ రెండు నిమిషాలకు 8 కోట్లు అంటే మామూలు విషయం కాదు.
ఒకవైపుపలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లు గా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాలలో బిజీగా గడుపుతున్నారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్న ఈయన అనంతరం ఆచార్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది అయితే శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. ఇప్పటికే దాదాపు 50% షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు సమాచారం.