Ram Charan, Upasana: ఆ ఫోటోలో ఉన్నది నిజంగా రాంచరణ్ కూతురేనా?

  • June 21, 2023 / 01:09 PM IST

రామ్ చరణ్ ఉపాసన దంపతులు నిన్న వేకువజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయని చెప్పాలి. రాంచరణ్ ఉపాసన దంపతులకు పాప జన్మించిందనే విషయం తెలియడంతో అభిమానులు అలాగే అల్లు అర్జున్, వరుణ్ తేజ్, ఎన్టీఆర్ వంటి సినీ సెలబ్రెటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పాపను చూడటం కోసం మెగా ఫ్యామిలీ అర్ధరాత్రి నుండి అపోలో హాస్పిటల్ వద్ద ఎదురుచూసిన విజువల్స్ కూడా నిన్న పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

మనవరాలిని చూసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి మీడియాతో తన ఆనందాన్ని కూడా పంచుకున్నారు. మంచి ఘడియల్లో పాప జన్మించిందని.. మా కుటుంబంలో ఆనంద వాతావరణం ఎదురైందని చిరు తెలిపారు. ఇదిలా ఉండగా.. చరణ్ కూతురి ఫోటోలు లీక్ అయినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ ఫోటోలు చూసి ఎవరి పోలికో చెప్పాలని.. చిట్ చాట్ లు కూడా నిర్వహిస్తున్నారు నెటిజన్లు. వాస్తవానికి ఈ ఫొటోలో ఉన్నది చరణ్ – ఉపాసన ల కూతురా కాదా అనే విషయం ఎవ్వరికీ తెలీదు.

అప్పుడే పుట్టిన పిల్లలను ఫోటోలు తీయకూడదు అంటుంటారు. ఉపాసన హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తారు. కాబట్టి.. ఆమె పాపని ఫోటోలు తీయడానికి ఒప్పుకునే అవకాశం అయితే లేదు. చిరంజీవి కూడా ఇలాంటి వాటికి అస్సలు అంగీకరించరు. అయినప్పటికీ ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలో ఉన్న బేబీలో చరణ్ పోలికలు ఎక్కువ ఉన్నట్టు నెటిజన్లు చెప్పుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus