మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన లు తల్లిదండ్రులు కాబోతున్నారు. త్వరలోనే ఉపాసన ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు ఆయన తెలియజేశారు. రాంచరణ్- ఉపాసన లు 2012 లో పెళ్లి చేసుకున్నారు. దాదాపు 10 ఏళ్ళ తర్వాత ఈ దంపతులు ఓ బిడ్డకు జన్మినివ్వబోతున్నట్టు స్పష్టమవుతోంది. ‘ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం వల్ల.. రాంచరణ్ – ఉపాసన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.
ఈ సంతోషకరమైన వార్తను మీతో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.. ఇట్లు సురేఖ- చిరంజీవి కొణిదెల, శోభన – అనిల్ కామినేని ‘ అంటూ రాసి ఉన్న ఓ ఫోటోని చిరు షేర్ చేశారు. రాంచరణ్ – ఉపాసన ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్. అయితే వాళ్ళు తర్వాత ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరిది కులాంతర వివాహం. అయితే పెళ్ళైన వెంటనే వీళ్ళు పిల్లలు కావాలని అనుకోలేదు. దీంతో రకరకాల ఊహాగానాలు, విమర్శలు గుప్పించేవారు కొంతమంది నెటిజన్లు. ఆడకూతురు అని చూడకుండా ఉపాసన పై కూడా ఘోరమైన ట్రోలింగ్ జరిగేది.
అయితే వీటిని చరణ్ – ఉపాసన దంపతులు లెక్కచేయలేదు. వాళ్ళ గొప్ప లక్ష్యాన్ని చేరుకునే వరకు పిల్లల్ని కనకూడదు అనుకున్నారు. ఇప్పుడు చరణ్ – ఉపాసన అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. రాంచరణ్ సినీ పరిశ్రమలో తిరుగులేని స్టార్ హీరోగా నిలదొక్కుకున్నాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇక ఉపాసన.. అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం తరపున కీలక బాధ్యతలు నిర్వహిస్తూ మరోపక్క సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఆదర్శ మహిళగా నిలుస్తుంది.
ఇక చరణ్ – ఉపాసన లు 10 ఏళ్ళ తర్వాత తల్లిదండ్రులు కాబోతుండడంతో మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. సినిమాల విషయానికి వస్తే చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. అలాగే ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబుతో మరో పాన్ ఇండియా మూవీ చేయడానికి సిద్ధపడుతున్నాడు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 12, 2022