Ram Charan: బన్నీ, తారక్, మహేష్ లో ఉన్న క్వాలిటీస్ నాలో ఉంటే బాగుండేది!

  • July 15, 2023 / 08:44 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ అనంతరం గ్లోబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా ఈయన గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇలా కెరియర్ పరంగా చరణ్ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే చరణ్ కి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందులో భాగంగా ఈయనని ప్రశ్నిస్తూ టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి అల్లు అర్జున్ ఎన్టీఆర్ మహేష్ బాబు ఈ ముగ్గురు హీరోలలో ఉన్న క్వాలిటీ మీలో ఏవి లేవు వారిలో ఉన్న ఏ క్వాలిటీస్ మీలో ఉంటే బాగుంటుందని ఫీల్ అవుతారని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు చెప్పినటువంటి సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు ఆయనలో ఉన్నటువంటి ఎనర్జీ నాకు ఉంటే చాలా బాగుంటుందని తెలిపారు.

అలాగే అల్లు అర్జున్ చాలా స్ఫూర్తిగా ఉంటారు. ఎవరైనా ఏదైనా అన్న సీరియస్ గా తీసుకోకుండా సరదాగా ఉంటారు. ఆ క్వాలిటీ నాలో ఉంటే బాగుంటుందని తెలిపారు.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ మహేష్ బాబు చాలా అందంగా ఉంటారు. ఆయనలో ఉన్నటువంటి అందం కొంచమైనా నాకు ఉంటే బాగుండేదని అనిపించిందని తెలిపారు.

ఈ విధంగా టాలీవుడ్ స్టార్ హీరోలలో ఉన్నటువంటి ఈ క్వాలిటీస్ తనలో లేవు అంటూ ఈ సందర్భంగా రామ్ చరణ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక రామ్ చరణ్ (Ram Charan) గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇన్ని రోజులు తనభార్య ఉపాసన డెలివరీ కావడంతో ఈయన సినిమా షూటింగుకు కాస్త విరామం ఇచ్చారు. అయితే తిరిగి ఈయన తన సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారని తెలుస్తుంది.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus