Upasana Dress Cost: ఉపాసన పింక్ డ్రెస్ ఖరీదెంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

  • April 25, 2023 / 01:10 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ భార్య ఉపాసన ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఉపాసన పెడుతున్న పోస్ట్ లు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఉపాసన త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఉపాసన బేబీ షవర్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఉపాసన పింక్ ప్యాటర్న్డ్ డ్రెస్ లో కనిపించగా షార్ట్ స్లీవ్స్, డీప్ వీ నెక్ తో ఉన్న ఈ డ్రెస్ ఖరీదు 90,471 రూపాయలు కావడం గమనార్హం.

నీడిల్ థ్రెడ్ బ్రాండ్ కు సంబంధించిన ఈ డ్రెస్ లో ఉపాసన మరింత అందంగా కనిపిస్తున్నారని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బేబీ షవర్ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఉపాసన ఫోటోలను షేర్ చేయడంతో పాటు తన పోస్ట్ లో మీ ప్రేమకు మేము ఇద్దరం కృతజ్ఞత కలిగి ఉన్నామని సుష్మిత, శ్రీజ, సైర్న్, స్మితలకు థాంక్స్ అని చెప్పుకొచ్చారు.

ఈ వేడుకలో ఉపాసన (Upasana) ఫ్రెండ్స్ కూడా పాల్గొని సందడి చేశారు. ఉపాసన అతి త్వరలో చెప్పే శుభవార్త కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. శంకర్, బుచ్చిబాబు ప్రాజెక్ట్ లతో కెరీర్ విషయంలో రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. శంకర్ రామ్ చరణ్ ను ఏ విధంగా చూపించబోతున్నారో అని ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి త్వరలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus