ఆ అమ్మాయి బోల్డ్ పెర్ఫార్మెన్స్ చూసి చాలా డిస్టర్బ్ అయ్యాను – వర్మ
August 18, 2018 / 01:31 PM IST
|Follow Us
సాధారణంగా తాను తీసే సినిమాలతో లేదా ట్విట్టర్ లో చేసే స్టేట్ మెంట్స్ తో అందర్నీ డిస్టర్బ్ చేస్తుండే రాంగోపాల్ వర్మ మొట్టమొదటిసారిగా ఒక అమ్మాయిని చూసి డిస్టర్బ్ అయ్యాడట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలపడం విశేషం. వర్మ నిర్మిస్తున్న తాజా చిత్రం “భైరవగీత”. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఇవాళ ఆ సినిమాలోని హీరోయిన్ ఐరా స్టిల్ ను షేర్ చేసిన వర్మ “ఈ అమ్మాయి బొల్డ్ పెర్ఫార్మెన్స్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది” అని పేర్కొన్నాడు.
ఈ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహించగా.. ఐరా అనే అమ్మాయి తన ప్రతిభతో రామ్ గోపాల్ వర్మని ఆకట్టుకుందట. వర్మ నిర్మిస్తున్న ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే.. ఇప్పుడు ఇండస్ట్రీ చూపు ఐరా వైపు మరలింది. సో, సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా వర్మ ప్రోద్భలంతో ఐరా అగ్ర కథానాయిక కాకపోయినా కొన్నాళ్లపాటు ఇండస్ట్రీలో హీరోయిన్ గా హల్ చల్ చేయడం ఖాయం.