ఇప్పటివరకూ ఒక దర్శకుడి కెరీర్ కి మహా అయితే సినిమా రిజల్ట్ లేదా సినిమా బిజినెస్, కలెక్షన్స్ బట్టి ఆధారపడి ఉండేది. కానీ.. మొట్టమొదటిసారిగా ఒక టీజర్ ఎలా ఉండబోతోంది అనే విషయం మీద ఒక దర్శకుడి కెరీర్ మాత్రమే కాదు జీవితం కూడా ఆధారపడి ఉంది. ఆ దర్శకుడు మరెవరో కాదు మేవరిక్ రాంగోపాల్ వర్మ. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “ఆఫీసర్”. నాగార్జున కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం వర్మ కెరీర్ కు ఎంత ముఖ్యమనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. హిట్ కి మొహం వాచిపోయి ఉన్న వర్మకు నాగార్జున లాంటి అగ్ర కథానాయకుడు పిలిచి మరీ అవకాశం ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. కానీ.. వర్మ తనకు ఇచ్చిన అద్భుతావకాశాన్ని పెద్దగా వినియోగించుకోలేకపోయాడు అని ఫస్ట్ టీజర్ తోనే తెలిసిపోయింది. టీజర్ కట్ మొత్తానికి ఒక్కటంటే ఒక్క ఆకట్టుకొనే షాట్ కూడా లేకపోవడం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఎవ్వరూ ఊహించనంత చీప్ గా ఉండడంతో ఈ సినిమా కూడా ఫ్లాపేనని జనాలు ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు.
కట్ చేస్తే.. పవన్ కళ్యాణ్ ను శ్రీరెడ్డి బండబూతులు తిట్టడం వెనుక అసలు సూత్రధారి వర్మ అనే విషయాన్ని వర్మే స్వయంగా యూట్యూబ్ ద్వారా అందరికీ వెల్లడించడంతో ఆయన శిష్యులు కూడా వర్మను అసహ్యించుకోవడం మొదలెట్టారు. ఈ ఎఫెక్ట్ “ఆఫీసర్” సినిమా మీద కూడా పడుతుంది అని ఎక్స్ పెక్ట్ చేసిన రాంగోపాల్ వర్మ ఉన్నపళంగా “ఆఫీసర్” సెకండ్ టీజర్ ను రేపు విడుదల చేస్తున్నట్లు ఎనౌన్స్ చేశాడు. ఈ టీజర్ మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎఫెక్ట్ ఉండడం అనేది సర్వసాధారణం. అయితే.. ఈ టీజర్ ఏమాత్రం బాగోకపోయినా సినిమా మీద ఆ ఎఫెక్ట్ పడడం అనేది ఖాయం. మరి వర్మ ఇంత సీరియస్ ఇష్యూని పట్టించుకోకుండా ఉండడు అనేది జగమెరిగిన సత్యం. చూద్దాం వర్మ మరి ఏమేరకు తన దర్శకత్వ ప్రతిభను ప్రూవ్ చేసుకొంటాడో.