Ram Gopal Varma: అందుకే వాళ్లు కామ్‌గా ఉంటున్నారన్న వర్మ!
December 30, 2021 / 01:19 PM IST
|Follow Us
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచనలం అనే సంగతి తెలిసిందే. వివాదాస్పద అంశాల గురించి స్పందించే విషయంలో వర్మ ముందువరసలో ఉంటారు. ఈ మధ్య కాలంలో వర్మ తీసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. గత మూడు రోజులుగా వర్మ ఏపీ థియేటర్లలో టికెట్ల అంశం గురించి స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాజాగా ఏపీ ప్రభుత్వం గురించి వర్మ షాకింగ్ కామెంట్లు చేశారు.
సినిమా ఇండస్ట్రీ విషయంలో ఏపీ ప్రభుత్వంకు, కరోనా మహమ్మారికి తేడా లేదని వర్మ వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరు కరెక్ట్ కాదని వర్మ చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం థియేటర్ల విషయంలో టికెట్ ధరల విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వర్మ అన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు మాట్లాడకపోవడంలో వింతేమో లేదని ఆర్జీవీ వెల్లడించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయం గురించి మాట్లాడాలిన అవసరం కూడా లేదని వర్మ పేర్కొన్నారు.
బాగా సెటిల్ అయిన వాళ్లు ఇండస్ట్రీ పెద్దలు అని వర్మ అభిప్రాయపడ్డారు. వాళ్లు ప్రభుత్వంతో గొడవ పడాలని అనుకోవడం లేదని అందుకే వాళ్లు కామ్ గా ఉన్నారని వర్మ చెప్పుకొచ్చారు. హీరోల రెమ్యునరేషన్ గురించి ఏపీ సర్కార్ చేస్తున్న వ్యాఖ్యలు స్టుపిడ్ ఆర్గ్యుమెంట్స్ అని వర్మ వెల్లడించారు. ప్రొడ్యూసర్ ఎంత ఖర్చు చేసి సినిమాను నిర్మించారో నిర్మాత చూడరని హీరో ముఖాన్ని చూసి మాత్రమే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని వర్మ పేర్కొన్నారు.
హీరో అనేవాడు బ్రాండ్ అని వర్మ వెల్లడించారు. వర్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వర్మ చేసిన కామెంట్ల వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సినీ ప్రముఖులు వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల ఏపీలో టికెట్ రేట్ల పెరుగుదల మరింత ఆలస్యం అవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ వల్ల టికెట్ రేట్ల సమస్య పరిష్కారం అవుతుందని చాలామంది భావిస్తున్నారు.