RGV,Pawan Kalyan: అందుకే జగన్ సీఎం అయ్యారంటున్న వర్మ!
January 5, 2022 / 05:02 PM IST
|Follow Us
ప్రముఖ టాలీవుడ్ దర్శకులలో ఒకరైన రామ్ గోపాల్ వర్మ ఏపీలో టికెట్ రేట్లను తగ్గించడం గురించి టీవీ ఛానెళ్లలో ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రశ్నించడంతో పాటు సోషల్ మీడియా ద్వారా తనదైన శైలిలో సమాధానాలను ఇస్తున్నారు. వర్మ సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించడంతో పాటు సినిమా టికెట్ ధర తయారీదారుడు వినియోగదారుడు మధ్య అనుబంధం అని చెప్పుకొచ్చారు. సినిమా టికెట్ల ధర విషయంలో ప్రభుత్వ జోక్యం అనవసరం అని వర్మ కామెంట్లు చేశారు.
బియ్యం, పంచదార కోసం రేషన్ షాపులను సృష్టించినట్టు రేషన్ థియేటర్లను సృష్టించడం గురించి ఆలోచించాలని వర్మ ఏపీ ప్రభుత్వానికి సూచించారు. ఈ వివాదం గురించి స్పందించాలని వర్మ సినీ ప్రముఖులను కోరారు. ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించుకోకపోతే భవిష్యత్తులో నోళ్లు మెదపలేరని వర్మ చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు కాకపోతే సీఎం జగన్ కు అన్ని ఓట్లు వచ్చేవా? అంటూ వర్మ ప్రశ్నించారు. జగన్ బ్రాండ్ ఏ విధంగా వైఎస్సార్ నుంచి వచ్చిందో పవన్ బ్రాండ్ కూడా అలానే వచ్చిందని వర్మ కామెంట్లు చేశారు.
మహేష్ బాబు బ్రాండ్ కూడా అలానే వచ్చిందని వర్మ తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఆలోచించే జనాలు జగన్ ను సీఎం చేశారని వర్మ వెల్లడించారు. బ్రాండ్ తోనే ప్రతి విషయం ముడిపడి ఉంటుందని వర్మ చెప్పుకొచ్చారు. ఆర్జీవీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మంత్రి పేర్ని నాని ఇచ్చిన సమాధానాలకు సైతం వర్మ తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ధనికుల్ని పేదలను చేయడం కరెక్ట్ కాదని అలా చేస్తే ఏపీ ఇతర రాష్ట్రాల కంటే పేద రాష్ట్రం అవుతుందని వర్మ కామెంట్లు చేశారు.
వర్మ చేసిన కామెంట్లపై కొంతమంది నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు నెటిజన్లు నెగిటివ్ గా స్పందిస్తున్నారు. వర్మ ఎంట్రీతో ఏపీలో టికెట్ రేట్ల పెంపు మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.