ఆఫీసర్ వల్ల అందరూ నష్టపోయారు వర్మ తప్ప

  • June 4, 2018 / 01:25 PM IST

నాగార్జున హీరోగా రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన కళాకండం “ఆఫీసర్” గత శుక్రవారం విడుదలై డిజాస్టర్ ఆఫ్ ది డెకేడ్ గా నిలిచిన విషయం తెలిసిందే. నాగార్జున మొదలుకొని సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ వరకూ అందరూ నష్టాలతో, చెడ్డ పేరుతో కొట్టుమిట్టాడుతుంటే ఒక్క వర్మ మాత్రం ఆఫీసర్ రిజల్ట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అదెలా సాధ్యం అనుకొంటున్నారా.. బేసిగ్గా “ఆఫీసర్” చిత్రానికి నిర్మాత కూడా అయిన వర్మ ఈ చిత్రాన్ని వీలైనంత తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించాడు. నాగార్జునతో తనకున్న రిలేషన్ ను అడ్డుపెట్టుకొని ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ కంటే తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చాడు. ఆ విధంగా దాదాపు 5 కోట్ల రూపాయాల లాభంతో హ్యాపీగా ముంబై “కంపెనీ” ఆఫీస్ లో కూర్చుని వోడ్కా తాగుతూ ట్విట్టర్ లో అనవసరమైన ట్వీట్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు వర్మ. మరి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ల సంగతి ఏంటో.

అయితే.. ఇవాళ ఉదయం చిత్ర నిర్మాతల్లో ఒకరైన సుధీర్ చంద్ర మాత్రం “మేం ఎవరినీ మోసం చేయలేదు, సినిమా ఫెయిల్ అయ్యింది అంతే మేం ఫెయిల్ అవ్వలేదు. కొన్ని మీడియా హౌసెస్ మేమేదో మోసం చేసామంటూ అబద్ధపు కథనాలు ప్రచురిస్తున్నాయి. వాటిలో ఏమాత్రం నిజం లేదు” అని ఒక పెద్ద లెటర్ రిలీజ్ చేయడం కొసమెరుపు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus