RGV: వర్మ కావాలనే ఇదంతా చేస్తున్నారా?

  • September 29, 2022 / 12:34 PM IST

టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. గతంలోనూ ఈ రీ రిలీజ్‌లు జరిగినప్పటికీ.. ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. ఈసారి ట్రెండ్‌కి ఆధ్యుడు మాత్రం మహేష్‌బాబే. ఆ విషయం పక్కనపెడితే.. ఈ ట్రెండ్‌లోకి కూడా రామ్‌గోపాల్‌ వర్మ వచ్చేశారు. ఆయనొస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా. మొత్తం ఆగం ఆగం చేస్తారు. ఇప్పుడు రీ రిలీజ్‌ ట్రెండ్‌ని కూడా ఇదే తరహాలో చేస్తారేమో అని అభిమానులు భయపడుతున్నారు. అంతగా ఏమైంది అనుకుంటున్నారా?

నితిన్‌ కెరీర్‌లో అత్యంత భయంకరమైన సినిమా ఏది అంటే.. అతని అభిమానులు కచ్చితంగా ‘అడవి’ సినిమా పేరే చెబుతారు. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర రాజం ఆ రోజుల్లో విడుదలై హీరోకి, నిర్మాతకు, ప్రేక్షకులకు పీడకలగా మిగిలిపోయింది. ఇప్పుడు అలాంటి సినిమాను రీ రిలీజ్‌ చేస్తున్నారు. అదేంటి ఆ సినిమా ఎలా చేస్తారు.. చేస్తే గీస్తే హిట్‌ సినిమానో, బాగున్న సినిమానో చేయాలి కానీ ఫ్లాప్‌ సినిమా చేయడమేంటి అనుకుంటున్నారా?

ఎందుకంటే అక్కడ రిలీజ్‌ చేస్తోంది వర్మ కాబట్టి. అందరూ నడిచే దారిలో నడవడం ఆయనకు నచ్చదు. అందుకేనేమో ఇప్పుడు ‘అడవి’ సినిమాను రీ రిలీజ్‌ చేస్తున్నారు. అక్టోబరు 14న ఈ సినిమాను మళ్లీ విడుదల చేస్తున్నట్లు ట్విటర్‌ ద్వారా తెలిపారు. అయితే సినిమా విడుదలకు థియేటర్ల వాళ్లు ముందుకొస్తారా అనేది చూడాలి. మామూలుగా అయితే ఆ సినిమా వేయరు. మరి వర్మ ఏం చేస్తారో చూడాలి. నితిన్‌ ఈ విషయంలో ఎలా స్పందిస్తారు అనేది కూడా ఆసక్తికరంగతా మారింది.

అయితే, ఇదంతా వర్మ రీ రిలీజ్‌ ట్రెండ్‌ను ఎద్దేవా చేయడానికే చేస్తున్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. కొత్త సినిమాలు తీసుకురాకుండా, పాత సినిమాలు రీ రిలీజ్‌ చేసి చంకలు గుద్దుకోవడం ఎందుకు అనే సన్నాయి నొక్కులు కొన్ని వినిపిస్తున్నాయి. వాటి నేపథ్యంలోనే వర్మ ఇలా ‘అడవి’ సినిమా రీరిలీజ్‌ అంటున్నారు అని టాక్‌. ఇక రీరిలీజ్‌ల సంగతి చూస్తే ‘పోకిరి’తో మొదలై.. ‘జల్సా’, ‘తమ్ముడు’తో కొనసాగి.. ‘చెన్నకేశవరెడ్డి’తో అదుర్స్‌ అనిపించింది.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus