RGV: శివ సినిమాను చైనీస్ మూవీ నుంచి కాపీ కొట్టా.. అసలు రహస్యం బయటపెట్టిన వర్మ!
July 13, 2022 / 06:42 PM IST
|Follow Us
ఒకప్పుడు వర్మ దర్శకత్వంలో వచ్చే సినిమాలు అంటే ప్రేక్షకులలో కూడా ఎన్నో అంచనాలు ఉండేవి.ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటాయనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఉండేది. ఈ విధంగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.ఇకపోతే రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన శివ సినిమా ఎవర్ గ్రీన్ హిట్ సినిమా అని చెప్పాలి. ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన హిట్ కొట్టిన ఈ సినిమా గురించి తాజాగా రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా రామ్ గోపాల్ వర్మ లడ్కీ అనే సినిమాను తెరకెక్కించిన విషయం మనకు తెలిసిందే. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా చైనాలో కూడా విడుదల చేయబోతున్నట్లు తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వర్మ వెల్లడించారు. ఇక మంగళవారం ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో భాగంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడారు. ఈ క్రమంలోనే మార్షల్ ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేయడానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించగా..
తాను యవ్వనంలో ఉన్నప్పుడు ఎంటర్ ది డ్రాగన్ ఏకంగా 20 సార్లు చూసానని ఆ సమయంలో తన వద్ద డబ్బులు లేకపోయినా సైకిల్ పై వెళ్లి మరి సినిమా చూసే వాడినని అలా ఆ సినిమా ప్రభావం నాపై ఎంతో పడిందని వర్మ వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమాని చూసే తెలుగులో తాను తెరకెక్కించిన శివ సినిమా చేశానని చైనీస్ సినిమా ఎంటర్ ది డ్రాగన్ సినిమాను కాపీ కొట్టి శివ సినిమా చేశానని వర్మ ఈ సందర్భంగా అసలు రహస్యం బయటపెట్టారు.
ఆ సినిమాలో హీరో ఒక రెస్టారెంట్ కోసం పోరాటం చేస్తారు తెలుగులో హీరో ఓ కాలేజీ కోసం పోరాటం చేస్తారు. కేవలం ఇదొక్కటి మాత్రమే మార్చాను మిగిలినదంతా సేమ్ టు సేమ్ అలాగే చేశానని వర్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ విధంగా శివ సినిమా గురించి వర్మ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.