తాను తీసే సినిమాతోనే కాకుండా అప్పుడూ తన హస్కీ గొంతుతో పాటలు కూడా పాడుతూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంటాడు రాంగోపాల్ వర్మ. “రక్త చరిత్ర”లో క్లైమాక్స్ ఎపిసోడ్ లో వచ్చే “కత్తులతో సావాసం” అనే పాట పాడిన వర్మ ఆ తర్వాత “సత్యా 2” సినిమా కోసం ఒక రోమాంటిక్ సాంగ్ కూడా పాడాడు.
అయితే.. “రక్త చరిత్ర” ఫ్యాక్షన్ సినిమా కావడంతో, ఆ పాటకు వర్మ వాయిస్ సరిగ్గా సరిపోయింది. కానీ “సత్య 2″లో పాడిన రోమాంటిక్ ట్రాక్ ను మాత్రం ఆడియన్స్ ఎంజాయ్ చేయకపోవడం అటుంచి చిరాకుపడ్డారు కూడా. ఆ తర్వాత కొంతకాలం పాటలకు దూరంగా ఉన్న వర్మకు మళ్ళీ ఇంకో పాట పాడాలని ఫిక్సయ్యాడు. వర్మ తెరకెక్కిస్తున్న ఆఖరి తెలుగు చిత్రం “వంగవీటి”. ఈ సినిమాలో రౌడీయిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చే పాటను తానే పాడతానంటున్నాడట వర్మ. మరి ప్రేక్షకులు మరోమారు వర్మ పైత్యాన్ని తట్టుకోగలరా??