మనసుకు నచ్చింది.. నోటికి తోచింది.. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎవరిపైన అయితే వారిపైన ట్వీట్స్ చేసి రామ్ గోపాల్ వర్మ వార్తల్లో నిలిచారు. కొన్ని పోస్టులు అయితే విమర్శలకు, వివాదాలకు, కేసులకు కేంద్ర బిందువయింది. ఆ వార్తలు ఇక ఉండవు. తనకు తానే స్వచ్చందంగా ట్విట్టర్ ని వదిలేశారు. శనివారం ట్విట్టర్ వేదికను వదిలివేస్తున్నట్లు చివరి ట్వీట్ పోస్ట్ చేశారు. వెళ్తూ వెళ్తూ తనదైన స్టైల్లో ట్వీట్స్ చేశారు. ఇన్ని సంవత్సరాలు తనను అనుసరించినందుకు నో థాంక్స్ అని పేర్కొన్నారు. ట్విట్టర్‌లో తన జననం 27 మే, 2009 అని, మరణం 27 మే, 2017 అని తెలిపారు.
సరిగ్గా 8 సంవత్సరాల పాటు తాను ట్విట్టర్‌లో ఉన్న విషయాన్ని వెల్లడించారు. ఇకపై అభిమానులకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఇకమీదట ఫోటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లోనే పోస్ట్ చేయనున్నట్లు చెప్పారు. దీంతో వర్మ అభిమానులు బాధపడుతుంటే, కొంతమంది మాత్రం వాన వెలిసిందని సంబరపడుతున్నారు. ఇక నుంచి ఇన్‌స్టాగ్రామ్ లో వర్మ హంగామా మొదలు కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.