రామ్ గోపాల్ వర్మ అంటే ఒక సెన్సేషన్, ఎవరినో ఒకరిని గెలికి తిట్టించుకోవడం, మనుషుల వీక్ నెస్ క్యాష్ చేసుకోవడం బాగా తెలిసిన మేధావి. ఇక పవన్ ఫ్యాన్స్ కి బద్ద శత్రువు, పక్కలో బల్లెం లాంటోడు. పవర్ స్టార్ ఇమేజ్ ని ఉపయోగించుకొని సినిమాలు తీసి, సొమ్ము చేసుకుంటున్న నీతిలేని స్వార్ధపరుడు అనేది పవన్ అభిమానుల భయంకరమైన ఆరోపణ. వర్మ లేటెస్ట్ మూవీ పవర్ స్టార్ ఎంతటి సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే. పవన్ జీవితాన్ని ఉద్దేశిస్తూ పరోక్షంగా ఆయన చేసిన ఈ మూవీ పవన్ ఫ్యాన్స్ ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.
ముఖ్యంగా గడ్డి తిన్నావా సాంగ్, మరియు ట్రైలర్ లో సన్నివేశాలు వివాదంగా మారాయి. ఏదైతేనేమి వర్మ కోరిక తీరింది. సినిమా విడుదలై, ఎంతో కొంత డబ్బులు తెచ్చిపెట్టింది. పవన్ వీరాభిమానులం అని చెప్పుకొనే కొందరు వర్మపై కోపంతో సినిమాలు ప్రకటించారు. వాటిలో నూతన్ నాయుడు తెరకెక్కించిన పరాన్నజీవి అదే రోజు విడుదల కూడా అయ్యింది. అలాగే పోర్న్ జీవి, ఎవడ్రా వర్మను కొట్టింది అనే సినిమాలు కూడా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.
ఐతే పవన్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ…వర్మపై సినిమాలు తీసే ఈ బ్యాచ్ కూడా వర్మ టైపే అని అనాలి. వర్మ వలే వీరు కూడా బర్నింగ్ ఇష్యూ ని క్యాష్ చేసుకోవడనికి థర్డ్ గ్రేడ్ మూవీస్ తో సిద్దమైపోయారు. వీరికి వర్మపై కోపం కానీ, పవన్ పై ప్రేమ గానీ ఏమి ఉండవు. కేవలం సిట్యువేషన్ క్యాచ్ చేసుకొని కాసిన డబ్బులు సంపాదించుకోవాలి. పవన్ ఫ్యాన్స్ అని చెప్పుకొని ఆ సినిమాకు విపరీతమైన ప్రచారం, ఫ్యాన్స్ లో సింపతీ తెచ్చుకోవాలనేది వీరి ఆరాటం. కాబట్టి వీళ్లకు, వర్మకు పెద్ద తేడా ఏమి లేదు అనేది నిజం.