హీరోను ‘స్టుపిడ్’ గా ట్రీట్ చేస్తున్న దర్శకుడు!

  • January 30, 2017 / 06:42 AM IST

టాలీవుడ్ లో ట్యాలెంటెడ్ దర్శకుల్లో పూరీ జగన్నాధ్ స్టైలే వేరు…ఆయన తీసే సినిమాల్లో కధ విషయం పక్కన పెడితే…పూర్తి స్క్రీన్‌ప్లే తో సినిమాను నడిపించే కెప్యాసిటీ ఉన్నవాడు పూరీ….అయితే అదే క్రమంలో పూరీ స్టైల్ ఆఫ్ టేకింగ్ కు చాలా మంది యువ హీరోలు ఫిదా అయిపోయి మరీ పూరితో సినిమా చెయ్యాలి అన్న ఆలోచనతో ఉంటారు అంటే అతిశయోక్తి కాదు…ఇదిలా ఉంటే పూరీ సినిమాలే కాదు…ఆయన సినిమా కోసం పెట్టే టైటిల్స్ కూడా చాలా డిఫరెంట్ అనే చెప్పాలి. విషయంలోకి వెళితే….కుర్ర హీరోలతో సినిమా చేసే దిశగా ప్లాన్ చేసిన పూరీ…..ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయని అంటున్నారు.

అయితే ఇజమ్ సినిమాతో కాస్త డీలా పడ్డ పూరీ…వెనకడుగు వేసి….యువ హీరోలతో సినిమాలు చెయ్యాలి అని ఫిక్స్ అయ్యీ….ఇలా రామ్ తో సినిమాకు ఒకే చెప్పాడని సమాచారం..అయితే అదే క్రమంలో ఈ సినిమా టైటిల్ కూడా చాల్ డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు పూరీ….అదేమిటంటే….’స్టుపిడ్’. అయితే ఈ సినిమాలో కధ విషయంలో రామ్ ఎనర్జీని మరింత పెంచేలా ఉంటుందని చెబుతున్నారు.  ఇక రామ్ విషయానికే వస్తే…నేను శైలజ సూపర్ సక్సెస్ తర్వాత హైపర్ తో పర్వాలేదు అనిపించుకున్న రామ్ పూరితో ఓ డిఫరెంట్ కథతో రాబోతున్న క్రమంలో ఇప్పటికే హిట్స్ విషయంలో వెనుకబడ్డ రామ్….ఈ సినిమాతో అయినా హిట్ కోవలోకి వచ్చి టాప్ హీరోల లిస్ట్ లోకి వెళ్తాడెమో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus