Ram Prasad, Rashmi: కామెడీ పేరుతో అంతేసి మాటలు అనడమా కరెక్టేనా?
December 29, 2022 / 06:57 PM IST
|Follow Us
టాలీవుడ్లో హాట్ యాంకర్ రష్మీకి తెలుగు సరిగ్గా రాదు. తెలుగు మాట్లాడుతుంది కానీ అది తెలుగులా ఉండదు. దీంతో ఆమెను ఈటీవీ షోల్లో కమెడియన్లే కాదు, ఇతర ఛానళ్ల నటులు కూడా ఏడిపిస్తుంటారు. అలా అని ఆమెకు మనోభావాలు ఉండవా? కోపం రాదా? అంటే వస్తుందనే చెప్పాలి. స్పోర్టివ్‌నెస్‌తో ఆ మాటల్ని పట్టించుకోకుండా ముందుకు సాగుతూ ఉంది. అలా ఉంది కదా అని ఆమెను నోటికొచ్చిన మాట అనేయొచ్చా?.. ఏంటిలా అడుగుతున్నాం అంటున్నారా? ఇటీవల వచ్చిన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ప్రోమో చూస్తే తెలిసిపోతుంది.
న్యూ ఇయర్, స్కూల్ డేస్ అంటూ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఓ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. అందులో ప్రధాన నటులు, యాంకర్ స్కూలు పిల్లల్లా మారిపోయి సందడి చేశారు. అమ్మాయిలు స్కర్ట్లు వేసుకుంటే, అబ్బాయిలు చెడ్డీలు వేసుకొని వచ్చారు. ఇదంతా పక్కనపెడితే.. ఎలాంటి డ్రెస్‌లో అయినా తన హాట్నెస్ తగ్గకుండా చూసుకునే రష్మి ఈ ఎపిసోడ్‌లోనూ కొనసాగించింది. యూనిఫామ్ ఆమెకు భలేగా కుదిరించి అని చెప్పాలి. అయితే ఆమెను చూసి రామ్‌ప్రసాద్, ఇమ్మాన్యుయేల్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
పోర్న్ రంగం గురించి ఐడియా ఉన్నవాళ్లకు మియా ఖలీఫా ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు రష్మీని రామ్‌ప్రసాద్ మియా ఖలీఫాతో పోల్చాడు. దీంతో ఆమె నవ్వుకుంది, పక్కనున్న ఇంద్రజ విసుక్కున్నారు. కానీ అభిమానులు మాత్రం ‘ఛీ ఇదేంటి.. ఇలా అనేశాడు’ అంటున్నారు. జోకులు వేయడానికి, కామెడీ చేయడానికి బాడీ షేమింగ్ చేయడం జబర్దస్త్ బ్యాచ్‌కు అలవాటు. అయితే దీని కోసం ఇలాంటి అడ్డదిడ్డమైన పోలికలు పెట్టడం మాత్రం సరికాదు అనేది నెటిజన్ల మాట.
అయితే ఇక్కడే ఓ డౌట్. రామ్‌ప్రసాద్ అంత మాట అన్నా.. రష్మీ చాలా స్పోర్టివ్‌గా నవ్వి ఊరుకుంది. అయితే ఎపిసోడ్లో ఈ మాట ఉంటుందా? ఎడిట్ చేస్తారా అనేది తెలియదు. కానీ ప్రోమోలో మాత్రం ఉంచారు. ఈ వార్త రాసే సమయానికి ప్రోమోలో ఆ పదం ఉంది.