సాధారణంగానే ప్రతి శుక్రవారం ఇద్దరుముగ్గురు హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీపడుతుంటారు. ఇక పండగ టైమ్ లో ఆ పోటీ మరింత విస్తృతమవుతుంటుంది. అయితే.. ఈ దశరాకీ చోటు చేసుకోనున్న పోటీ మాత్రం ఒన్ సైడ్ అయిపోతుంది. ఈ దసరా కానుకగా అక్టోబర్ 18న విడుదలకానున్న రామ్ “హలో గురు ప్రేమ కోసమే”, విశాల్ “పందెం కోడి 2” చిత్రాల్లో ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా విశాల్ సినిమా మీదే ఉంది. “హలో గురు ప్రేమకోసమే” క్లీన్ ఎంటర్ టైన్మెంట్ తో తెరకెక్కిన క్లాస్ సినిమా కాగా.. “పందెం కోడి 2” మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఉరమాస్ సినిమా. ఈ రెండు సినిమాల్లో రిపీట్ వేల్యూ ఎక్కువగా ఉండే అవకాశం “పందెం కోడి 2″కి మాత్రమే ఉంది. ఈ పండగనాడు కుటుంబసభ్యులతోనే సినిమా చూడాలని ఫిక్స్ అయినప్పటికీ.. అందరూ కామెడీ కంటే యాక్షన్ తోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న “పందెం కోడి 2” లాంటి రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా వైపే మొగ్గుచూపడం కామన్.
ట్రేడ్ టాక్ కూడా అలాగే ఉండడంతో.. “ఉన్నది ఒకటే జిందగీ” లాంటి డిజాస్టర్ అనంతరం “హలో గురు ప్రేమకోసమే” లాంటి డీసెంట్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రామ్ కాస్త టెన్షన్ పడుతున్నాడు. ఒక తెలుగు స్ట్రయిట్ సినిమా అయ్యుండి.. డబ్బింగ్ సినిమాకి భయపడడం అంటే ఆలోచించాల్సిన విషయమే. మరి బాక్సాఫీస్ వద్ద ఎవరు విజయభేరీ మోగించి దసరా విన్నర్ గా నిలుస్తారో చూడాలి.