వైరల్ అవుతున్న రామజోగయ్య శాస్త్రి ఎమోషనల్ ట్వీట్..!
November 25, 2022 / 06:55 PM IST
|Follow Us
సోషల్ మీడియాలో పాజిటివిటీ కంటే కూడా నెగిటివిటీ ఎక్కువై పోయింది. సామాజిక మాధ్యమాలు సెలబ్రిటీలు, సామాన్యుల మధ్య దూరాన్ని తగ్గించేశాయి కానీ విమర్శలకు కూడా కారణమవుతున్నాయి. ఇప్పటికే నెటిజన్లు ఎంతోమంది సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టారు. ఫ్యాన్ వార్స్ సంగతి అయితే చెప్పక్కర్లేదు. రీసెంట్గా రామజోగయ్య శాస్త్రిని టార్గెట్ చేశారు నెటిజన్లు.. బాలకృష్ణ నటిస్తున్న కొత్త సినిమా ‘వీర సింహా రెడ్డి’ చిత్రంలో శాస్త్రి రాసిన ‘జై బాలయ్య’ సాంగ్ గురించి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
దీంతో ఆయనపై కొందరు చేసిన కామెంట్స్ విషయంలో శాస్త్రి బాగా ఫీల్ అయ్యారు. తన ఆవేదనను ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి శిష్యుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి.. తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి.. చేసే ప్రతి సినిమాలోనూ.. రాసే ప్రతి పాటలోనూ.. పలికే ప్రతి పదంలోనూ ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది.. ఇక ‘జై బాలయ్య’ పాట విషయానికొస్తే..
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మళ్లీ ట్యూన్ కాపీ కొట్టాడని ట్రోల్ చేస్తున్నారు. ఈ సాంగ్ విజయశాంతి ‘ఒసేయ్ రాములమ్మ’ లా ఉందని కొందరు.. మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ పాటలా ఉందని కొందరు అంటున్నారు. ఆ లిరిక్స్ ఏంటి అంటూ శాస్త్రిపై కామెంట్స్ చేశారు. కొందరు ఏకంగా ఆయన పేరు ముందు ఉండే ‘సరస్వతీ పుత్ర’ బిరుదు లక్ష్యంగా వ్యాఖ్యలు చేయడంతో ఆయన నొచ్చుకున్నారు. అలాంటి వారికి తన స్టైల్లో సున్నితంగా సమాధానం చెప్పారు.
‘‘ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను…దయచేసినన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు.. అన్నట్టు…జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరును సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రిగా మార్చుకున్నాను.. ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు.. ఉంటే ఇటు రాకండి’’ అంటూ ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘‘సంగీత జ్ఞానం లేని మూర్ఖులు ఎవరో ఏదో వాగారని.. మీరు ఫీల్ అవకండి గురువు గారూ’’ అంటూ సినీ, సంగీత ప్రియులు, బాలయ్య అభిమానులు శాస్త్రికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.
ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను…దయచేసినన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు..
అన్నట్టు…జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరు ను
సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి గా మార్చుకున్నాను..ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు..
ఉంటే ఇటు రాకండి