Jr NTR: రామా నాయుడు, జూనియర్ ఎన్టీఆర్‌తో ఆ సినిమా చేసుంటే మరో గిన్నిస్ రికార్డ్ అయ్యిండేది..?
March 10, 2023 / 05:38 PM IST
|Follow Us
మూవీమొఘల్ డా. డి. రామా నాయుడు తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అమోఘం.. ప్రకాశం జిల్లాలోని పల్లెటూరి నుంచి వచ్చి అనతి కాలంలోనే అగ్రనిర్మాతగా ఎదిగి తెలుగు సినిమాని ప్రపంచపటంలో పెట్టిన ఘనత ఆయనది.. భారతదేశంలోని వివిధ భాషల్లో 100కి పైగా చిత్రాలు తీసి శతాధిక చిత్ర నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.. 1963లో ‘అనురాగం’ అనే చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించిన రామా నాయుడు..
1964లో సోలో ప్రొడ్యూసర్‌గా సురేష్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించి నటరత్న ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో ‘రాముడు భీముడు’ తీసి.. ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు.. అక్కడినుండి వెనుదిరిగి చూసుకోలేదు.. ఆ తర్వాతి తరం, ఆ తర్వాత తరం.. ఇలా దాదాపు మూడు తరాల నటీనటులతో సినిమాలు తీశారు. దర్శకులు, సాంకేతిక నిపుణులు, నటీనటులను ఎందరినో పరిశ్రమకు పరిచయం చేశారాయన..రామారావు తర్వాత ఆయన తనయుడు బాలకృష్ణతో ‘రాము’, ‘కథానాయకుడు’ చిత్రాలు తీసిన రామా నాయుడు..
నందమూరి వంశం మూడో తరం కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా ప్లాన్ చేద్దామనుకున్నారు.. టైటిల్ ‘రాముడు భీముడు’ కావడం ఓ విశేషమైతే.. స్వయంగా నాయుడు గారే దర్శకత్వం చేద్దామనుకోవడం మరో విశేషం.. నటరత్న ఎన్టీఆర్‌తో అదే పేరుతో సినిమా ద్వారా నిర్మాతగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. ఆయన మనవడితో తానే దర్శకత్వం వహిస్తాననడం ఆయనలో వర్కింగ్ స్పిరిట్‌కి నిదర్శనం.. అది కనుక వర్కౌట్ అయ్యింటే..
తాతా – మనవడితో ఒకే పేరుతో సినిమా తీసిన ఘనతతో పాటు నిర్మాతగానూ రామా నాయుడు పేరు మరోసారి గిన్నిస్ బుక్‌లో ఎక్కేది కానీ కార్యరూపం దాల్చలేదు.. తర్వాత సురేష్ బాబు నిర్మాతగానూ తారక్‌తో సినిమా ప్లాన్ చేశారని.. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆపేశారని తర్వాత వార్తలు వచ్చాయి.. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ‘రాముడు భీముడు’ చేసుంటే అది తన కెరీర్లో ఓ మెమరబుల్ మూవీగా మిగిలిపోయేది..