అన్నదమ్ముల్లో గెలిచేదెవరు..?

  • January 2, 2019 / 01:01 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన ‘వినయ విధేయ రామా’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11 న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించాడు. అంతే కాదు తమిళ హీరో ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేష్ వంటి భారీ కాస్టింగ్ ఉండడంతో ఈ చిత్రంలో మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చే అంశాలు ఎక్కువగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సంక్రాంతికి వచ్చే చిత్రాలలో ఇదే పెద్ద చిత్రం కావడంతో మొదటి వారంలో ఈ చిత్రం బాక్సాఫీస్ మోత మోగించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికీ విడుదలైన ట్రైలర్, పాటలతో ఈ విషయం స్పష్టమవుతుంది.

ఇక ‘వినయ విధేయ రామా’ విడుదలైన తరువాత రోజు ‘ఎఫ్2’ చిత్రం విడుదల కాబోతుంది. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావి పూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కాబోతుంది. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెళ్ళాల టార్చర్ తో ఫ్రస్ట్రేషన్ గురి అయ్యే తోడల్లుళ్ళు గా వెంకటేష్, వరుణ్ తేజ్ లు నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాంజేంద్ర ప్రసాద్ , ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, ప్రియదర్శి వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.

ఇక అసలు విషయంలోకి వెళితే..’వినయ విధేయ రామా’ ‘ఎఫ్2’ … చిత్రాలతో మొదటి సారిగా అన్నదమ్ములు అయిన రాంచరణ్, వరుణ్ తేజ్ లు పోటీకి దిగుతున్నారు. సాధారణంగా మెగా హీరోల చిత్రాలు పోటీపడటం చాలా అరుదుగా జరుగుతుంది. గతంలో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ చిత్రాలకు మినిమం రెండు, మూడు వారాలు గ్యాప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకునే వారు.అయితే ఈ రెండు చిత్రాలతో పాటు బాలకృష్ణ ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ రజినీకాంత్ ‘పెట్టా’ చిత్రాలు ఉన్నప్పటికీ అవి ‘వన్ టైం వాచబుల్’ మూవీస్ గా చెప్పుకోవచ్చు. అయితే సంక్రాంతి పండుగ టైం కాబట్టి మాస్ మరియు కామెడీ ఉన్న చిత్రాలనే ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఆలా అని మిగిలిన చిత్రాలు చూడరనేది కాదు.. కుటుంబ ప్రేక్షకులు ఎక్కువ.. మక్కువ చూపుతారన్న మాట. ఇక ‘వినయ విధేయ రామా’ బోయపాటి చిత్రం కాబట్టి మాస్ అంశాలు కచ్చితంగా ఉంటాయి.., ఫ్యామిలీ అంశాలు పెట్టినప్పటికీ బోయపాటి సినిమాల్లో యాక్షన్ అంశాలే ప్రధానంగా ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. ఇక ‘ఎఫ్2’ చిత్ర విషయానికి వస్తే.. అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్ చిత్రాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు.. కామెడీ కచ్చితంగా ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఉంటుంది. అందులోనూ సంక్రాంతి హీరోగా వెంకటేష్ కి తిరుగులేని రికార్డు ఉంది. ‘ఫిదా’ చిత్రంతో వరుణ్ తేజ్ కు తెలంగాణ యాస బాగా కలిసొచ్చింది. మరోసారి ఈ చిత్రంలో కూడా తెలంగాణా యాసను ట్రై చేసాడు వరుణ్. దిల్ రాజు చిత్రం కాబట్టి ఎక్కువ థియేటర్లలో విడుదలయ్యేలా చూసుకుంటాడు. ఈ విషయాల్ని పరిగణలోకి తీసుకుంటే అందమ్ములైన రాంచరణ్, వరుణ్ తేజ్ ల మధ్య పోటీ తప్పేలా లేదు. మరి ఈ అన్నదమ్ముల పోటీలో ఎవరు గెలుస్తారో.. మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus