సంకల్ప్ రెడ్డి పై సంచలన కామెంట్స్ చేసిన చరణ్

  • December 19, 2018 / 07:33 AM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంతరిక్షం’ ప్రీ-రిలీజ్ వేడుక డిసెంబర్ 18 న (నిన్న) హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రాంచరణ్ హాజయ్యారు. ఈ వేడుకలో రాంచరణ్ మాట్లాడుతూ… వరుణ్ మీద ఉన్న ప్రేమతో మాత్రమే నేను ఇక్కడికి రాలేదు, ఈ మద్యే ‘అంతరిక్షం’ ట్రైలర్ చూసాను, ఈ ట్రైలర్ మీద ఉన్న నమ్మకం, గౌరవం తో నేనిక్కడికి వచ్చాను. ఇంత మంచి ట్రైలర్ ఈ మధ్య కాలంలో నేను చూడలేదు, నిజంగా అవుట్ స్టాండింగ్ ట్రైలర్.! ఒక గ్రేట్ టీం చాలా పాషన్ తో తీశారు. టెక్నిషియన్స్ అందరికీ థాంక్స్ . డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి… తన సైజు కి తన విజన్ కి సంబంధం లేదు. మనిషికన్నా గొప్పది తన ఆలోచన.. అలాంటి ఆలోచనలున్న వ్యక్తులు ఎప్పటికీ దిగజారారు .. ఎప్పటికీ ఉన్నత స్థాయిలో ఉంటారు… అది సినీ రంగమైనా… రాజకీయ రంగమైనా.. ఏ రంగమైనా సరే.! అలంటి గ్రేట్ ఆలోచనులున్న వ్యక్తుల్లో ఒక రాజమౌళి, ఒక సుకుమార్ , ఒక క్రిష్ గారు వీళ్ళ లాగే సంకల్ప్ కూడా గొప్పస్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

వ‌రుణ్ ఎప్పుడూ మంచి సినిమాలు చేస్తూ మమ్మల్ని సప్రైజ్ చేస్తూనే వస్తున్నాడు. కొన్ని సార్లు ఆనందపడ్డాను.. కొన్ని సార్లు అసూయ కూడా పడ్డాను. ‘అంతరిక్షం’ ట్రైల‌ర్ చూసి వ‌రుణ్‌ మీద చాలా జెల్సీ ఫీలింగ్ వచ్చింది. ఎంతో అదృష్టం ఉంటే త‌ప్ప ‘అంతరిక్షం’ లాంటి సినిమా చేసే అవ‌కాశం రాదు. త‌న డెడికేషన్, ఆలోచ‌న తీరే.. ఇందుకు కార‌ణం. ఆలోచనే ఇష్ట‌మైన వ్య‌క్తుల్ని, సినిమాల్ని ద‌గ్గ‌ర‌కు చేరుస్తుంది. పాజిటీవ్ గా ఆలోచించే ప్ర‌తి ఒక్క‌రికీ దేవుడు మంచే చేస్తాడు. మన అభిమానులందరూ గర్వపడే సినిమా ఇది. డిసెంబర్ 21 న విడుదల కాబోతుంది. అందరూ మిస్ అవ్వకుండా చూడండి అంటూ రాంచరణ్ చెప్పుకొచ్చాడు.

              

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus