కరోనా సమయంలో థియేటర్లు మూతపడడంతో ప్రేక్షకులు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. వెబ్ సిరీస్ లు, సినిమాలంటూ ఓటీటీలతో మంచి కాలక్షేపం చేస్తున్నారు. అందుకే తెలుగులో ఓటీటీ వేదికలు పెరుగుతున్నాయి. ‘ఆహా’, ‘జీ5’ లాంటి వేదికలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. ఇప్పుడు ఈటీవీ కూడా ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో ఓటీటీను లాంచ్ చేయాలనుకుంటున్నారు. ఈటీవీ వద్ద వందల సంఖ్యలో సినిమాలు ఉన్నాయి.
అప్పట్లో కొన్ని వందల సినిమాలను వందేళ్ల లీజుకి చాలా తక్కువ ధరకు తీసుకున్నారు.ఇవి కాకుండా ఉషాకిరణ్ బ్యానర్ పై వందకు పైగా సినిమాలను నిర్మించారు. అవన్నీ కూడా ఈటీవీలోనే చూడగలం. ఇప్పుడు ఈ సినిమాలన్నీ ఓటీటీకి మూలధనం. అయితే వెబ్ సిరీస్ లు, టాక్ షోలు, సినిమాల కోసం మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయించుకున్నాను. తొలి విడతగా రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నారు. ఇప్పటికే వెబ్ సిరీస్ ల నిర్మాణంపై ప్లాన్స్ జరుగుతున్నాయి.
అలానే ఉషాకిరణ్ బ్యానర్ పై చిన్న సినిమాలు తీసి వాటిని ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కొందరు యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకులతో సినిమాలు, వెబ్ సిరీస్ లను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?