Rana: విరాట పర్వం కథ విన్నప్పుడు అలాంటి అనుభూతి కలిగింది!
June 13, 2022 / 01:46 PM IST
|Follow Us
నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రానా, సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాట పర్వం. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాని ఈనెల 17వ తేదీ విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. 17వ తేదీ ఎంతో ఘనంగా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ తను ఒక యాక్టర్ గా ఎప్పుడు ఒకే జానర్ లో కాకుండా వివిధ రకాల జానర్ లో సినిమా చేయాలని భావిస్తాను. ఇలా ఒకే జానర్ రిపీట్ చేయడం నాకు నచ్చదు అంటూ తెలిపారు. ఇందులో తాను రవన్న పాత్రలో కనిపిస్తానని డాక్టర్ అయిన రవన్న ఆ పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమకారుడిగా మారుతాడని తెలిపారు.
ఇక ఈ సినిమా గురించి రానా మాట్లాడుతూ ఒక లోతైన సముద్రంలోకి వస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో విరాటపర్వం సినిమా కథ విన్నప్పుడు తనకు అలాంటి అనుభూతి కలిగిందని,ఈ సినిమా కథ వింటున్నప్పుడు మనసుకు ఎంతో బరువుగా అనిపించిందని రానా విరాటపర్వం సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.ఇలా ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియజేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచారు.
ఇందులో రానా రావన్న పాత్రలో నటించగా సాయిపల్లవి వెన్నెల పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాలో నవీన్ చంద్ర ప్రియమణి వంటి తదితరులు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు పోస్టర్స్ టీజర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ విధంగా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా జూన్ 17వ తేదీ విడుదల కానుంది.