Rana, Naga Shaurya: నాగ శౌర్య ని హెచ్చరించిన రానా..!
July 26, 2021 / 10:18 AM IST
|Follow Us
దగ్గుబాటి రానా మరో హీరో నాగశౌర్యని హెచ్చరించడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటూ నాగశౌర్యతో రానా అన్నాడు.ఇది సీరియస్ గా జరిగిన సంభాషణ కాదు.. కంగారు పడకండి..! వివరాల్లోకి వెళితే… నాగశౌర్య హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది.కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన షూటింగ్ ఈ మధ్యనే మొదలైంది. ఈ మూవీలో నటుడు బ్రహ్మాజీ కూడా కీలకపాత్ర పోషిస్తున్నాడు.ఈ మధ్యనే అతని పాత్రకి సంబంధించిన సన్నివేశాలు కూడా చిత్రీకరించడం జరిగింది.
అటు తర్వాత నాగశౌర్య.. బ్రహ్మాజీ తో తీసుకున్న ఓ ఫోటోని షేర్ చేసాడు.ఇందులో బ్రహ్మాజీ నుదుటి పై నామాలు ఉన్నాయి. అమాయకపు లుక్‌లో ఇతను ఫొటోకు పోజు ఇచ్చాడు. దీనికి శౌర్య.. ‘నా తమ్ముడు బ్రహ్మాజీ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాడు. మీ అందరి సపోర్ట్ తనకి ఉండాలి. దయచేసి యంగ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయండి’ అని ఫన్నీ ట్వీట్ చేశాడు.దీనికి రానా కూడా సరదాగా స్పందించాడు..’వామ్మో ఇదేంటి గురు!! నాగశౌర్య.. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా.
బ్రహ్మాజీ చూపు తేడాగా ఉంది. నువ్వు ఏమంటావ్?’ అంటూ పేర్కొన్నాడు. దీనిపై శౌర్య బదులిస్తూ.. ‘నువ్వు చెప్పింది కరెక్ట్ భయ్యా. నాకూ తేడాగానే అనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండాల్సిందే’ అంటూ జవాబిచ్చాడు. సోషల్ మీడియాలో బ్రహ్మాజీ పై టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలాంటి ఫన్నీ కామెంట్స్ చేయడం మామూలే..! అతను అందరికీ అత్యంత సన్నిహితుడు.