Rana Daggubati: రెండు ఆపరేషన్లు చేయించుకున్నాను .. ఫైనల్ గా తన అనారోగ్యం గురించి నోరువిప్పిన రానా
March 18, 2023 / 11:43 AM IST
|Follow Us
రానా ఒకప్పుడు చాలా బలంగా ఉండేవాడు. 6 అడుగుల 3 అంగుళాల హైట్, 6 ప్యాక్ కూడా మెయింటైన్ చేసే రానా.. ‘బాహుబలి'(సిరీస్) తర్వాత బాగా బక్క చిక్కిపోయాడు. దీనికి కారణం.. రానా ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలే అంటూ చాలా వార్తలు వచ్చాయి. కానీ రానా మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తూనే వచ్చాడు. అరణ్య సినిమా కోసం తాను వెయిట్ లాస్ అయినట్టు కవర్ చేశాడు. అయితే రానాకి ఓ కన్ను కనిపించదు అని ఓ సందర్భంలో డైరెక్ట్ గానే రివీల్ చేశాడు.
కానీ ఆ విషయాన్ని మాత్రం దాచిపెట్టాడు. కానీ ఇటీవల ‘రానా నాయుడు’ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా తన అనారోగ్య సమస్యల గురించి రివీల్ చేసేశాడు. ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా ఈ విషయంపై స్పందించడం జరిగింది. ‘నాకు చిన్నప్పటి నుండి కుడి కన్ను కనిపించదు. దానికి నాకు ఓ ఆపరేషన్ అయ్యింది. అలాగే ఇటీవల నాకు కిడ్నీ మార్పిడికి సంబంధించిన ఆపరేషన్ కూడా జరిగింది. చాలా రోజుల నుండి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ వచ్చాను.
నాకు బీపీ కూడా ఉంది, అందువల్ల గుండె సంబంధిత సమస్య కూడా వచ్చింది. దీంతో కిడ్నీ పాడైంది. ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదమని డాక్టర్లు చెప్పారు, అందుకే విదేశాల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నా’ అంటూ ఓపెన్ గానే చెప్పేశాడు. తన అనారోగ్య సమస్యలు తొలిగిపోయిన తర్వాతే మిహికా బజాజ్ ను వివాహం చేసుకున్నట్టు రానా తెలిపాడు.నేను ఆనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు ధైర్యంగానే ఉండేవాడిని, ఎప్పుడు కుంగిపోలేదు. అదే నన్ను కాపాడింది’ అని కూడా తెలియజేశాడు రానా.