Rana Daggubati: ‘విరాటపర్వం’ మ్యూజిక్ డైరెక్టర్ రూమర్స్ పై రానా ఘాటు స్పందన..!

  • November 2, 2021 / 06:32 PM IST

దగ్గుబాటి రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. ‘రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్’ అనేది దీనికి క్యాప్షన్. ఇప్పటికే విడుదల చేసిన ‘కోలో కోలు’ పాట అలాగే టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది.మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా విడుదల చేసిన టీజర్ కూడా ఆకట్టుకుంది. అందులో రానా లుక్ అలాగే సాయి పల్లవి బోల్డ్ డైలోగ్స్, ప్రియమణి లుక్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ గా నిలిచింది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సురేష్ బొబ్బిలి తప్పుకున్నాడంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయం పై హీరో రానా తనదైన శైలిలో ఘాటుగా స్పందించాడు. మీడియాలో సర్క్యులేట్ అవుతున్న కథనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. దాని పై రానా స్పందించాడు. ‘ఎవడు బ్రో నీకు చెప్పింది… నీ సోది అంటూ మరికొన్ని డాట్ లు పెట్టాడు. అంటే రానా ఈ విషయం తిట్టుకుంటున్నట్టు ఆ ట్వీట్ సారాంశం అయ్యి ఉండొచ్చు.

ఇక థియేటర్లు తెరుచుకున్నప్పటికీ… ఇప్పటి వరకు ‘విరాటపర్వం’ విడుదల కాలేదు.నేరుగా ఓటిటిలో విడుదల చేయబోతున్నారు అంటూ కొన్నాళ్ళు ప్రచారం జరిగింది. కానీ అటు నిర్మాతలు కానీ ఇటు దర్శకులు కానీ ఆ విషయం పై స్పందించింది లేదు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus