రానా దగ్గుబాటి చిత్రం ‘అరణ్య’ ప్రపంచవ్యాప్తంగా మార్చి 26న విడుదల
January 6, 2021 / 05:24 PM IST
|Follow Us
హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి తెలుగు, హిందీ, ఇతర భాషల్లో సాధించిన వరుస విజయాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ఆయన నెగటివ్ రోల్ పోషించిన మునుపటి హిందీ చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’ బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఇప్పుడు తెలుగులో ‘అరణ్య’ పేరుతో విడుదలవుతున్న బహు భాషా చిత్రం ‘హాథీ మేరే సాథీ’తో ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన ఈ భారీ బడ్జెట్ మూవీని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా మార్చి 26న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు..
“నూతన సంవత్సరాన్ని, నూతన సాధారణతను స్వాగతిస్తూ, మార్చి 26న మీ దగ్గరల్లోని థియేటర్లో ‘హాథీ మేరే సాథీ/ అరణ్య/ కాండన్’ను తీసుకువస్తున్నందుకు మేం ఎంతగానో సంతోషిస్తున్నాం! నాపై మీరు చూపించిన ప్రేమ, మద్దతు, ఓర్పుకు ధన్యవాదాలు. మీరందరూ ఆ మూవీని చూస్తారని వేచి చూస్తుంటాను” అని రానా ట్వీట్ చేశారు. 25 సంవత్సరాలుగా ఒక అరణ్యంలో జీవిస్తూ వస్తున్న ఒక మనిషి కథ ‘అరణ్య’. ఈ చిత్రం పర్యావరణ సమస్యలు, అటవీ నిర్మూలన సంక్షోభం గురించి చర్చిస్తుంది. ఈ మూవీలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గావోంకర్ కీలక పాత్రలు పోషించారు. శంతను మొయిత్రా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఎ.ఆర్. అశోక్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.