భళ్ళాల దేవ బాధ పడ్డాడు…అవును ఎపుడూ గంభీరంగా కనిపిస్తూ, అందరినీ ఆటపట్టిస్తూ, నవ్వుతూ, అందమైన తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న బళ్ళాల దేవ తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఉద్వేగానికి లోనయ్యాడు…వివరాల్లోకి వెళితే, లీడర్ సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా…అంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ మంచి నటుడుగా ఎదగాలి అన్న ఆలోచనతోనే డీఫ్ఫెంరేట్ పాత్రలను చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అయితే అదే క్రమంలో మంచి నటుడుగా పేరు తెచ్చుకుంటూనే, హీరోగా నేనే రాజు…నేనే మంత్రి అన్న సినిమా చేశాడు ఈ హీరో. అదే క్రమంలో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ యువ హీరో కాస్త ఉద్వేగానికి లోనయ్యడు అని తెలుస్తుంది దానికి గల వివరాల్లోకి వెళితే…. హైదారాబాద్ లో జరిగిన నేనే రాజు నేనే మంత్రి మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో రానా తాత రామానాయుడిని తలచుకొని ఉద్వేగానికి లోనుకావడం అందరినీ కదిలించింది.
ఈ కార్యక్రమంలో రానా మాట్లాడుతూ తమ ఇంట్లో సినిమామే ప్రపంచం అని అంటూ తామంతా ఎప్పుడు సినిమాల గురించే మాట్లాడుకుంటాం అన్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. ఈ సినిమాను తన తాత రామానాయుడు చూడలేకపోయాడు అన్న బాధ తనకు ఉందని అంటూ ఎమోషనల్ అంశాలతో కూడిన ఇలాంటి చిత్రాలు తన తాతకు బాగా నచ్చుతాయి అంటూ భావోద్వేగానికి గురి అయి కంటి వెంట నీళ్ళు రావడంతో కాసేపు తన కన్నీరును అదుపు చేసుకోవడానికి సమయం తీసుకున్నాడు. ఇక కుమారుడి ఉద్వేగం చూసి సురేష్ బాబు సైతం కాస్త ఉద్వేగంగా మారడం చూసి అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా చలించిపోయారు. మొత్తంగా అదీ కధ.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.