వెంకటేష్ పాత్రను చేయనున్న రానా

  • April 8, 2017 / 08:08 AM IST

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో విక్టరీ వెంకటేష్ నటించిన గురు సినిమా మార్చి 31 న రిలీజ్ అయి రికార్డులు సృష్టిస్తోంది. బాక్సర్ కోచ్ గా వెంకీ నటనకు, సుధా కొంగర దర్శకత్వ ప్రతిభ తోడుకావడంతో కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో డైరక్టర్ సుధా గురు సీక్వెల్ కథను సిద్ధం చేసింది. వెంకటేష్ కు చెప్పి ఒకే చేయించుకుంది. ఆ చిత్రాన్ని నిర్మించడానికి సురేష్ బాబు కూడా ముందుకు వచ్చారు. తాజాగా ఈ కథ చదివిన రానా ఆశ్చర్యపోయారట. ఈ కథలో తానే నటిస్తానని బాబాయ్ ని కోరడంతో ఆయన ఆనందంగా ఒప్పుకున్నట్లు తెలిసింది.

బాహుబలి లో సిక్స్ ప్యాక్ తో అదరగొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న రానా మరో మారు తన కండల బలాన్ని చూపించనున్నారు.రానాకు తగినట్లుగా స్క్రిప్ట్ లో మార్పులు చేసే పనిని సుధా మొదలెట్టారు. ప్రస్తుతం రానా తేజ దర్సకత్వంలో నేనే రాజు నేనే మంత్రి సినిమా చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత గురు సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus